Sun. Jul 26th, 2026

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా దర్శకుడు రవి నంబూరి తెరకెక్కించిన లేటెస్ట్ ఎమోషనల్ లవ్ డ్రామా చిత్రమే చెన్నై లవ్ స్టోరీ. మాస్ మూవీ మేకర్స్ ఎంతో నమ్మి తెరకెక్కించిన ఈ సినిమా క్రేజీ రెస్పాన్స్ ని ప్రీమియర్ నుంచే అందుకుంది.

ఇక్కడ నుంచి సినిమా మొదటి రోజు కూడా భారీ బుకింగ్స్ తో దుమ్ము లేపగా ఇప్పుడు ఆ ప్రీమియర్స్ ఇంకా మొదటి రోజు వసూళ్లు కలిపి మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి భారీ మొత్తంలో 12 కోట్లకి పైగా గ్రాస్ ప్రపంచ వ్యాప్తంగా రావడం అనేది గమనార్హం. ఇది కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే భారీ మొత్తం కావడం విశేషం.

ఇక రెండో రోజు కూడా సాలిడ్ బుకింగ్స్ ఈ చిత్రానికి కొనసాగుతున్నాయి. దీనితో చెన్నై లవ్ స్టోరీ ఒక గ్రాండ్ వీకెండ్ పై కన్నేసింది అని చెప్పొచ్చు. ఇక ఈ రెండు రోజుల వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా సాయి రాజేష్ కథ, కథనం, నిర్మాణం వహించారు.

The put up భారీ వసూళ్లతో ‘చెన్నై లవ్ స్టోరీ’ డే 1 మొదలు.. కిరణ్ కెరీర్లోనే రికార్డు! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.