యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ఫాంటసీ యాక్షన్ – అడ్వెంచర్ ‘మిరాయ్’ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్‌ను అందుకుని దూసుకుపోతుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ కాగా, థియేటర్లలో ఇంకా సందడి చేస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన OG కూడా మాసివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. అయితే, మిరాయ్ మాత్రం తన జోరును ఇంకా కొనసాగిస్తోంది.
ఈ సినిమా తాజాగా వరల్డ్‌వైడ్‌గా రూ.150 కోట్ల గ్రాస్ మార్క్‌ను టచ్ చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ సినిమాతో తేజ సజ్జా తన కెరీర్‌లో మరో మైలురాయిని ఈ సినిమా ద్వారా అందుకున్నాడు. ఇక ఈ సినిమా నార్త్ అమెరికాలో ఏకంగా 3 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిన సంగతి తెలిసిందే.
మంచు మనోజ్ విలన్‌గా నటించిన ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా శ్రియ శరణ్, జగపతి బాబు, జయరామ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు గౌర హరి సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు.
The put up మరో మైలురాయిని చేరిన ‘మిరాయ్’ first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
