Sun. Jul 5th, 2026

తెలుగు నేలకి చెంది కోలీవుడ్ లో సెటిల్ అయ్యిన కొంతమంది నటుల్లో ప్రముఖ కమెడియన్ శ్రీమాన్ కూడా ఒకరు. తమిళ్ లో ఎన్నో సినిమాలు తాను కమెడియన్ గా చేశారు. తాను నటించిన ఎన్ని సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయినా తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకొని తాను ఎప్పటికీ తెలుగు వాడినే అని చెప్పిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.

అయితే ఇన్నేళ్ల తన సినీ కెరీర్ లో ఇప్పటికొచ్చి ఒక్క తెలుగు సినిమాలో కూడా తాను కనిపించలేదు. ఇది ఒకింత ఆశ్చర్యకరం కాగా దానిని బ్లాక్ బస్టర్ దర్శకుడు అనీల్ రావిపూడి తీర్చేసారని శ్రీమాన్ తనకి స్పెషల్ థాంక్స్ తెలిపారు. మీడియాలో ఓ వీడియో సహా అనీల్ తో కొన్ని ఫోటోలు షేర్ చేసుకొని తన మాతృభాష తెలుగులో మొదటి సినిమా చేసినందుకు ఎంతో ఆనందంగా ఉందని, నన్ను నేనే ఒకసారి తెలుగు సినిమాలో నటిస్తున్నానా అని గిచ్చుకున్నాను అని ఆ అవకాశం కల్పించిన అనీల్ రావిపూడి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని కాంచన నటుడు తెలిపారు.

ఇప్పుడు వెంకీ మామ, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో అనీల్ రావిపూడి సాలిడ్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీమాన్ నటిస్తున్నారు. ఆల్రెడీ మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకున్నట్టు తాను తెలిపారు. ఈ సినిమా ఫుల్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అని ప్రామిస్ చేశారు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే షైన్ స్క్రీన్, జీ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

The submit మొదటిసారి నా మాతృభాషలో నటిస్తున్నా – అనీల్ రావిపూడికి ‘కాంచన’ నటుడు శ్రీమాన్ థాంక్స్ first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.