Sun. Jul 5th, 2026

సూపర్‌స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో జయకృష్ణ ఘట్టమనేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేసింది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దర్శకుడు అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను మేకర్స్ జూలై 9న లాక్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే, ఇప్పుడు ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను జూలై 30కి మారుస్తున్నట్లు మేకర్స్ తాజాగా ఓ కొత్త పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ సినిమాతో క్లాష్‌ను నివారించేందుకు మేకర్స్ ఈ కొత్త డేట్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ సమర్పిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

The submit రిలీజ్ డేట్ వాయిదా వేసుకున్న ‘శ్రీనివాస మంగాపురం’.. కొత్త డేట్ ఎప్పుడంటే..? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.