Wed. Apr 29th, 2026

కోలీవుడ్ స్టార్ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా నటించిన లాంగ్ అవైటెడ్ సినిమానే దృవ నక్షత్రం. టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ మీనన్ తో చేసిన ఈ సినిమా అనేక వాయిదాలు పడుతూ వచ్చింది. ఎప్పుడో 2017 లోనే మొదలైన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో విడుదలకి నోచుకోలేదు. ఇంత జరిగినప్పటికీ గౌతమ్ మీనన్ మాత్రం థియేటర్స్ లోనే ఈ సినిమా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యి ఉన్నారు.

అయితే ఈ సినిమాకి ఉన్న ఆర్ధిక ఇబ్బందులు, లీగల్ వ్యవహారాలు రీత్యా ఫైనల్ గా ఈ మే 27కి థియేటర్స్ లో వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లోపు న్యాయస్థానంలో సినిమాకి సంబంధించిన హియరింగ్ లు తుది తీర్పు వచ్చే అవకాశం ఉందట. సో ఈ తొమ్మిదేళ్ల ఆలస్యం చిత్రం ఫైనల్ గా అప్పటికి రావచ్చు. ఇక ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ లు ఫీమేల్ లీడ్ లో నటించగా హరీష్ జై రాజ్ సంగీతం అందించారు.

The submit విక్రమ్ తొమ్మిదేళ్ల డిలే ప్రాజెక్ట్ ‘దృవ నక్షత్రం’కి కొత్త డేట్? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.