Sat. May 9th, 2026

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న యాక్షన్ చిత్రం పవర్ పేట కూడా ఒకటి. నితిన్ నుంచి సందీప్ చేతికి వచ్చిన ఈ సినిమా నుంచి మేకర్స్ లేటెస్ట్ గా సందీప్ కిషన్ పుట్టినరోజు కానుకగా ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ని అయితే వదిలారు.

ఇక ఈ గ్లింప్స్ లో సందీప్ కిషన్ రోల్ తాలూకా పవర్ గేమ్ ఎలా ఉంటుందో చూపించారు. తమ మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్ డైలాగ్స్ తో సందీప్ ఇందులో ఇంప్రెస్ చేసాడు. అలాగే సినిమా టైటిల్ ని రివీల్ చేసిన విధానం ఇందులో మరింత ఇంప్రెస్ చేసింది అని చెప్పొచ్చు.

ఇక వీటితో పాటుగా మణిశర్మ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా గ్లింప్స్ ని మరింత ఎలివేట్ చేసింది. సో మొత్తానికి సందీప్ కిషన్ పవర్ పేట తో తన కెరీర్ లో మరో సాలిడ్ సినిమాని ఇవ్వనున్నాడని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రాన్ని 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా త్వరలోనే థియేటర్స్ లో ఈ చిత్రాన్ని విడుదలకి తీసుకురానున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

The publish సందీప్ కిషన్ పవర్ గేమ్ స్టార్ట్.. ఇంప్రెసివ్ గా ‘పవర్ పేట’ గ్లింప్స్! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.