మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ సెట్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకొచ్చింది. సినిమా కోసం వందల కోట్లు ఖర్చు చేయడం కాదు.. ఆడియన్స్‌ను ఆ లోకంలోకి తీసుకెళ్లడమే అసలైన సవాల్. ఈ విషయాన్ని పర్ఫెక్ట్గా క్యాచ్ చేసింది పెద్ది టీమ్. 1970, 80ల నాటి కథతో వస్తున్న ఈ సినిమా కోసం ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా టీమ్ ఏకంగా విజయనగరాన్నే సృష్టించారు.
ఆ కాలం నాటి విజయనగరం..
కథ డిమాండ్ మేరకు ఈ సినిమా కోసం 24 భారీ సెట్స్ నిర్మించారు. ఇవి కాకుండా మరో 60 నుంచి 70 చిన్నపాటి సెటప్స్ రెడీ చేశారు. చిన్న సినిమా అయితే ఎక్కడికి వెళ్లైనా షూటింగ్ చేసుకోవచ్చు. కానీ రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో ఉన్నప్పుడు పబ్లిక్ లో షూటింగ్స్ అంటే కష్టంతో కూడుకున్న పని. అందుకే ఆర్టిస్టులకు కంఫర్ట్ ఉండేలా, ఏ వాతావరణంలో అయినా షూటింగ్ ఆగిపోకుండా ఉండేందుకు ఏడాదంతా కష్టపడి ఈ విజయనగరం సెట్ వేశారు.
స్క్రీన్ పై చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు అది సెట్ అని ఏమాత్రం అనిపించకూడదనేది ఆర్ట్ డైరెక్టర్ టార్గెట్. పెద్ది సెట్స్ కూడా అలాగే చాలా న్యాచురల్ గా ఉంటాయని అవినాష్ కొల్లా నమ్మకంగా చెబుతున్నారు. విజయనగరం వీధులు, అక్కడి క్లాక్ టవర్.. ఇలా ప్రతి చిన్న డీటెయిల్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ డిజైన్ చేశారు.
భూగర్భంలో భారీ కుస్తీ సెటప్
ఈ కథలో క్రికెట్, కుస్తీ ఆటలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా ఎవరూ ఊహించని విధంగా ఒక అండర్ గ్రౌండ్ కుస్తీ సెటప్ వేశారు. గద పట్టుకుని రామ్ చరణ్ కనిపించే పవర్ ఫుల్ షాట్ ను ఆ భూగర్భ సెట్ లోనే చిత్రీకరించారు. ఈ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది. డీటైలింగ్ విషయంలో మేకర్స్ తీసుకుంటున్న ఈ జాగ్రత్తలు చూస్తుంటే, చరణ్ ఫ్యాన్స్‌కు థియేటర్లలో పూనకాలు ఖాయంగా కనిపిస్తోంది.
The put up Ram Charan ‘Peddi’: విజయనగరాన్నే సృష్టించారు.. భూగర్భంలో కుస్తీ సెటప్.. సెట్స్ వెనుక ఇంత కథ ఉందా? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
