Tue. Apr 21st, 2026

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డెకాయిట్’. షనీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ రివెంజ్ డ్రామా, ఏప్రిల్ 10, 2026న భారీ స్థాయిలో థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.

​సెన్సార్ బోర్డు నుంచి ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది. ఇక ఈ యాక్షన్ థ్రిల్లర్ నిడివిని మేకర్స్ 2 గంటల 32 నిమిషాలు గా ఖరారు చేశారు. ఉత్కంఠభరితమైన కథాంశంతో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పాజిటివ్ ట్రెండ్‌ను చూపిస్తుండటం సినిమా క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది.

​అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్ మరియు జైన్ మేరీ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

The publish సెన్సార్ పనులు ముగించుకున్న ‘డెకాయిట్’.. రన్ టైం ఎంతంటే..? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.