ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న పలు భారీ చిత్రాల్లో కొత్త ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయ్యింది. అవే డివోషనల్ కంటెంట్ తో కూడిన సినిమాలు పైగా వీటిలో యానిమేషన్ తో వస్తున్న సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఒకొక్కటిగా పలు అవైటెడ్ సినిమాలు భవిష్యత్తులో రానుండగా వచ్చే ఏడాది 2027 ముగింపు మాత్రం ప్యాకెడ్ గా ఉండబోతుంది అని చెప్పాలి. అవి వరుసగా చూస్తే..
మహావతార్ పరశురామ్ – డిసెంబర్
దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యానిమేషన్ చిత్రం నుంచి లేటెస్ట్ గానే మోషన్ పోస్టర్ టీజర్ వచ్చి సెన్సేషన్ గా మారింది. మహావతార్ నరసింహా తర్వాత వారి సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఈ సినిమా డిసెంబర్ విడుదలకి లాక్ చేశారు. ఆల్రెడీ ఈ సినిమా బాక్సాఫీస్ లెక్కలు 500 కోట్ల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ సినిమాని హోంబాలే ఫిలిమ్స్ మరియు క్లీం ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
రామాయణ పార్ట్ 2 – నవంబర్
పార్ట్ 1 ఇంకా విడుదల కాలేదు కానీ రణబీర్ సింగ్, సాయి పల్లవి అలాగే దర్శకుడు నితీష్ తివారి కాంబినేషన్ లో చేస్తున్న ఈ ఇంటర్నేషనల్ లెవెల్ సినిమాపై కూడా భారీ హైప్ ఉంది. పార్ట్ 2 ని మేకర్స్ నవంబర్ 2027 దీపావళి కానుకగా లాక్ చేశారు. పార్ట్ 1 హిట్ అయితే మాత్రం డెఫినెట్ గా పార్ట్ 2 కూడా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ సెట్ చేస్తుంది.
ఇలా చివరి రెండు నెలల్లో రెండు బిగ్గెస్ట్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బాగా ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. అయితే అక్టోబర్ నెలలో మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ బాహుబలి ఎటర్నల్ వార్ అనే యానిమేషన్ సినిమా కూడా ఉండే ఛాన్స్ ఉందని కొన్ని రూమర్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు కానీ ఒకవేళ ఉంటే మాత్రం వరుసగా మూడు నెలలు ఆడియెన్స్ కి పెద్ద ట్రీట్ గా అది నిలుస్తుంది అని చెప్పవచ్చు.
The publish 2027 ఎండింగ్: ఒకో నెల ఒకో డివోషనల్ సినిమా.. అన్నీ బాక్సాఫీస్ దగ్గర పెద్దవే first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
