Wed. Apr 22nd, 2026

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘జైలర్ 2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో పలువురు స్టార్స్ కేమియో పాత్రల్లో నటిస్తారని చిత్ర యూనిట్ గతంలోనె వెల్లడించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోవాలో సేతుపతి సీన్లను చిత్రీకరిస్తున్నారని కోలీవుడ్ వర్గాల టాక్.

అయితే, ఈ సినిమాలో విజయ్ సేతుపతి నిజంగానే నటిస్తున్నాడా అనే విషయంపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఇక గతంలో రజినీకాంత్-విజయ్ సేతుపతి గతంలో కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో ‘పెట్టా’ చిత్రంలో కలిసి నటించారు.

The publish ‘జైలర్ 2’కోసం వెర్సటైల్ యాక్టర్.. నిజమేనా..? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.