ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్లో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ గతంలోనే రాగా, ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.
ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రపై అందరిలో ఆసక్తి క్రియేట్ అయ్యింది. కాగా, ఈ క్రమంలో అల్లు అర్జున్‌కు ఇటీవల మరో తమిళ దర్శకుడు కథను వినిపించాడనే టాక్ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. యాక్షన్ చిత్రాలను తనదైన మార్క్‌లో తెరకెక్కించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇటీవల అల్లు అర్జున్‌ని కలిశాడని తెలుస్తోంది.
అంతేగాక, అల్లు అర్జున్‌కు ఆయన ఓ కథను కూడా వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా లేదు. మరి నిజంగానే అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది.
The publish అల్లు అర్జున్‌కు కథ వినిపించిన మరో తమిళ డైరెక్టర్.. నిజంగా షాకింగ్..? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
