Wed. Apr 22nd, 2026
Harish Shankar – DSP : ఉస్తాద్ వివాదం.. హరీష్ శంకర్‌ను అన్ ఫాలో చేసిన దేవిశ్రీ ప్రసాద్

టాలీవుడ్‌లో దర్శకుడు హరీష్ శంకర్ మరియు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ది సూపర్ హిట్ కాంబినేషన్. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ నుంచి ‘డిజె’ వరకు వీరిద్దరూ కలిసి ఎన్నో మ్యూజికల్ హిట్లను అందించారు. అయితే గత కొంతకాలంగా వీరి మధ్య సత్సంబంధాలు సరిగ్గా లేవనే వార్తలు వినిపిస్తుండగా తాజా పరిణామం ఆ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది.

 Additionally Learn : Allu Arjun : ఐకాన్ స్టార్ బర్త్ డే.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పిన బన్నీ వాసు

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హరీష్ శంకర్ పుట్టినరోజు నాడే ఈ గ్యాప్ స్పష్టంగా బయటపడింది. దేవిశ్రీ ప్రసాద్ తన సోషల్ మీడియా  అకౌంట్‌లో హరీష్ శంకర్‌ను అన్‌ఫాలో చేశారు. సాధారణంగా సెలబ్రిటీలు ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం పెద్ద చర్చకు దారితీస్తుంది. అలాంటిది ఒక దర్శకుడి పుట్టినరోజు రోజే మ్యూజిక్ డైరెక్టర్ ఇలా చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అందుక్కారణం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే టాక్ వినిపిస్తోంది. ఉస్తాద్ సినిమాకు మొదట దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వర్క్ చేసాడు. అయితే ఆ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తమన్‌ను తీసుకున్నారు.  డీఎస్పీ ఇతర ప్రాజెక్టుల వలన బిజీగా ఉండడం వలన తమన్ ని తీసుకున్నారు అని అన్నారు. ఈ వ్యాఖ్యలు దేవి శ్రీ ప్రసాద్‌ను కాస్త నొప్పించినట్టు సమాచారం. తన పనితీరుపై లేదా సమయంపై హరీష్ అలా బహిరంగంగా మాట్లాడటాన్ని డీఎస్పీ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అన్‌ఫాలో చేయడం ద్వారా తమ మధ్య దూరం పెరిగిందని డీఎస్పీ పరోక్షంగా సిగ్నల్ ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.