Wed. Apr 22nd, 2026
Actress Subhashini Suicide: భర్త వీడియో కాల్.. ఆత్మహత్య చేసుకున్న నటి సుభాషిణి..

Actress Subhashini Suicide: వీడియో కాల్‌ చేసిన భర్తతో వాగ్వాదం తర్వాత.. మనస్థాపంతో నటి ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని నింపింది.. చెన్నై నగరంలోని పోరూరులో నివసిస్తున్న నటి సుభాషిణి (36) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సినీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని ఆమె మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోరూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Learn Additionally: PM Modi: ఆత్మనిర్భర దేశాన్ని నిర్మించడమే మా లక్ష్యం.. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మోడీ వెల్లడి

శ్రీలంకకు చెందిన సుభాషిణి, తన భర్త పిప్పిన్‌తో కలిసి బెంగళూరులో నివసిస్తూ ఉండేది. అయితే, షూటింగ్‌ల కారణంగా చెన్నైలోని పోరూరులో ఒంటరిగా ఉంటూ టీవీ సీరియల్స్, సినిమాల్లో నటన కొనసాగించింది. ముఖ్యంగా “కయల్” అనే టీవీ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు పొందిన ఆమె, సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉండేది. ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, నిన్న రాత్రి భర్తతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న సమయంలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తీవ్ర మనస్థాపానికి గురైన సుభాషిణి ఈ దారుణ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక, కుటుంబ గోడవల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు స్నేహితులు చెబుతున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో బయటపడనున్నాయి. ఈ ఘటనతో సినీ పరిశ్రమతో పాటు అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.