బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ వరల్డ్ సినిమానే “రామాయణ”. మన చరిత్రని ప్రపంచానికి చాటి చెప్తామంటూ హాలీవుడ్ లెవెల్ హంగులతో ప్లాన్ చేసిన ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన రామ టీజర్ కి భిన్నమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ నేపథ్యంలో నిర్మాత నమిత్ మల్హోత్రా నుంచి కీలక ప్రెస్ నోట్ విడుదల అయ్యింది. ఇందులో తను రామాయణ కోసం లేటెస్ట్ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ దాని తాలూకా ఫీడ్ బ్యాక్ పై స్పందించారు. వచ్చిన విశేష ఆదరణకు తను ఆనందం వ్యక్తం చేశారు.
అలాగే ఔట్ పుట్ పరంగా తమ టీం అంతా అహర్నిశలు కృషి చేస్తున్నామని విమర్శలపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. ఇక దీనితో పాటుగా ఇదంతా కేవలం ఆరంభం మాత్రమే అని అసలు ట్రీట్ థియేటర్స్ లో ఈ దీపావళికి ఉంటుంది అని తన ప్రాజెక్ట్ పై ధీమా వ్యక్తం చేశారు. దీనితో తన ప్రెస్ నోట్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.
— Namit Malhotra (@malhotra_namit) April 7, 2026
The publish ‘రామాయణ’: ఇది కేవలం ఆరంభం మాత్రమే.. నిర్మాత కీలక ప్రెస్ నోట్ వైరల్ first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
