Tue. Apr 21st, 2026

తన మొదటి సినిమా తోనే దర్శకునిగా మెప్పించిన యువ దర్శకుడు సాయి మార్తాండ్. మౌళి తనుజ్ ని హీరోగా పరిచయం చేస్తూ వచ్చిన లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో సూపర్ డెబ్యూ తను అందుకున్నాడు. అయితే ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సత్తా చాటిన ఈ యంగ్ డైరెక్టర్ మన తెలుగు సినిమా దగ్గర ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్స్ కి కేరాఫ్ అయ్యిన అతి కొద్దిమంది హీరోస్ లో ఒకరైన అడివి శేష్ తో సినిమా చేస్తున్నట్టు టాక్ వచ్చింది.

అయితే ఇప్పుడు ఇది అధికారికంగా ప్రకటన వచ్చేసింది. శేష్ లేటెస్ట్ సినిమా డెకాయిట్ ప్రీ రిలీజ్ వేడుకలో సాయి మార్తాండ్ మరియు శేష్ లు తమ కాంబినేషన్ ని ఖరారు చేస్తూ ప్రకటించారు. మరి వీరి కలయికలో అడివి శేష్ స్టైల్ లో ఓ థ్రిల్లర్ వస్తుందా లేక సాయి మార్తాండ్ మార్క్ ఎంటర్టైనర్ వస్తుందా అనేది వేచి చూడాల్సిందే.

The submit అఫీషియల్: ‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ తో థ్రిల్లర్స్ హీరో.. first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.