Tue. Apr 21st, 2026
Sumanth: మృణాల్‌కు క్షమాపణలు చెప్పిన సుమంత్..!

టాలీవుడ్ క్లాసిక్ ‘సీతారామం’లో నెగెటివ్ షేడ్స్ ఉన్న విష్ణు శర్మ పాత్రలో సుమంత్ నటన అందరినీ ఎంతలా ఆకట్టుకుందో మనకు తెలిసిందే. అయితే, ఆ సినిమాలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ను ఇబ్బంది పెట్టినందుకు సుమంత్ ఇప్పుడు క్షమాపణలు కోరడం విశేషం. అదేంటీ అనుకుంటున్నారా.. తాజాగా అడివి శేష్ ‘డెకాయిట్’ (Dacoit) ప్రమోషన్లలో పాల్గొన్న సుమంత్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ‘సీతారామం సినిమాలో నేను మృణాల్‌కు క్షమాపణలు చెప్పే ఒక కీలకమైన సీన్ ఉంది. కానీ నిడివి కారణాల వల్ల ఎడిటింగ్‌లో ఆ సీన్‌ను తొలగించారు. ఆ పాత్ర పరంగా ఆమెకు సారీ చెప్పలేకపోయాననే ఫీలింగ్ నాలో ఉండిపోయింది’ అని సుమంత్ తెలిపారు.

Additionally Learn : Jailer2 : ఒకే ఫ్రేమ్‌లో నలుగురు సూపర్ స్టార్స్..

అంతేకాకుండా, మృణాల్‌కు ఆ ‘సారీ’ని మరో రూపంలో తీర్చుకున్నానని ఆయన చమత్కరించారు. “అందుకే ‘డెకాయిట్’ సినిమాలో మృణాల్‌కు ఛాన్స్ వచ్చేలా నేనే రికమండ్ చేశాను. అలా ఆమెకు సారీ చెప్పినట్లయ్యింది” అంటూ నవ్వుతూ వెల్లడించారు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ పాన్-ఇండియా థ్రిల్లర్‌లో సుమంత్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘సీతారామం’ తర్వాత మృణాల్, సుమంత్ కాంబినేషన్ మళ్ళీ ఈ సినిమాలో రిపీట్ అవుతుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఏప్రిల్ 10న విడుదల కాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.