నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మాస్ పీరియడ్ డ్రామా ‘ది ప్యారడైజ్’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేయగా, ఈ చిత్రం నుండి విడుదలైన మొదటి సింగిల్ ‘ఆయా షేర్’ సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ పాట రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే 100 మిలియన్ల వ్యూస్ మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది.
నాని కెరీర్‌లోనే సినిమా విడుదల కాకముందే 100 మిలియన్ల మైలురాయిని చేరుకున్న తొలి పాటగా ‘ఆయా షేర్’ నిలిచింది. అంతేకాకుండా, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ట్రాక్‌గా ఇది హిస్టరీ క్రియేట్ చేసింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన మాస్ బీట్స్, నాని ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఈ పాటలోని హుక్ స్టెప్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఒక భారీ సెట్‌లో స్లమ్ బ్యాక్ గ్రౌండ్ లో ఈ పాటను అత్యంత రిచ్‌గా చిత్రీకరించారు. విజువల్స్‌లో నాని రగ్గడ్ లుక్ మరియు హై-ఎనర్జీ డ్యాన్స్ బీట్స్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
View this put up on Instagram
The put up నాని ‘ప్యారడైజ్’ మ్యూజిక్ విధ్వంసం.. 100 మిలియన్ల వ్యూస్‌తో ‘ఆయా షేర్’ ఊచకోత! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
