Wed. Apr 22nd, 2026

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరోస్ లో అడివి శేష్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు శానియల్ డియో తెరకెక్కిన8ఇంట్రెస్టింగ్ క్రైమ్ యాక్షన్ సినిమా డెకాయిట్ కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా పట్ల సాలిడ్ బజ్ నెలకొనగా ఈ సినిమాకి కూడా ఇతర సినిమాల తరహాలోనే ముందు రోజే ప్రీమియర్స్ ఇండియాలో ప్లాన్ చేస్తారా అని ఎదురు చూశారు.

అయితే ఫైనల్ గా ఈ ప్రీమియర్స్ పై ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాకి ఎలాంటి ప్రీమియర్స్ లేవు అన్నట్టే శేష్ క్లారిటీ ఇచ్చాడు. ఇండియా వైడ్ గా ప్రీమియర్స్ లేవు కానీ మొట్ట మొదటి షో మాత్రం ఏప్రిల్ 10న ఉదయం 8 గంటల షోస్ తో డెకాయిట్ మొదలు కానున్నట్లు కన్ఫర్మ్ చేసాడు. సో ఇండియా వైడ్ గా డెకాయిట్ కేవలం రిలీజ్ రోజు నుంచే మొదలు కానుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించగా అన్నపూర్ణ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.

The put up ‘డెకాయిట్’ ప్రీమియర్స్ లేవ్.. ఇండియా వైడ్ ఫస్ట్ షో ఎన్ని గంటలకి అంటే first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.