Wed. Apr 22nd, 2026

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దీపికా పదుకోన్ హీరోయిన్ గా దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ నే ‘రాకా’. ఒక అద్భుతమైన సాలిడ్ ఫాంటసీ డ్రామాగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా విషయంలో అందరినీ ఎంతో ఎగ్జైట్ చేసిన పలు కీలక అంశాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ పేరు కూడా ఒకటి.

మొదట అంతా అనిరుద్ అనుకున్నారు కానీ అట్లీ సాయి అభ్యంకర్ ని తీసుకొచ్చి క్రేజీ ట్విస్ట్ అందించారు. దీనితో తన వర్క్ కోసం తెలిసిన వారు అంతా మరింత ఎగ్జైట్ అయ్యారు. మరి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ తాలూకా థీమ్ స్కోర్ ని విడుదల చేసారు. అయితే ఈ స్కోర్ ని విన్న ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో అనిపించి ఉండొచ్చు కానీ జెనరల్ ఆడియెన్స్ కి ఇందులో ఏమంత కొత్తదనం, యూనిక్ నెస్ లేదు అని అనిపించక మానదు.

కొంచెం అనిరుద్ మరికొంచెం దేవిశ్రీప్రసాద్ ని మిక్స్ చేసినట్టే ఉంది. దీనితో ఇలాంటి వరల్డ్ క్లాస్ సినిమాకి అంత సింపుల్ బీట్స్ ఎక్కేట్టట్టు లేవనెత్తిన కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక ముందు నుంచి తన వర్క్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

The submit ‘రాకా’ థీమ్ స్కోర్.. సాయి అభ్యంకర్ డిజప్పాయింట్ చేశాడా! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.