Wed. Apr 22nd, 2026

రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘స్పిరిట్’ చిత్ర షూటింగ్ సెట్‌లో ఒక చిన్న అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో చిత్ర బృందానికి చెందిన ఒక సభ్యుడికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. సెట్‌లోని కొన్ని టెంట్లు మరియు షూటింగ్ మెటీరియల్ పాక్షికంగా దగ్ధమైనట్లు సమాచారం. అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో ప్రభాస్ సెట్‌లో లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గత కొద్ది రోజులుగా ప్రభాస్ లేకుండానే ఇతర కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

​ప్రస్తుతం ప్రభాస్ షూటింగ్ నుండి చిన్న విరామం తీసుకున్నాడు. రీసెంట్‌గా ఒక వెకేషన్ ముగించుకుని వచ్చిన ఆయన, హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ సినిమా లాంగ్ షెడ్యూల్‌ను పూర్తి చేశాడు. తాజాగా ప్రభాస్ మరియు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలిసి హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్‌లో రణ్ వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమాను వీక్షించారు. థియేటర్ నుండి బయటకు వస్తున్న వీరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ‘ఫౌజీ’ చిత్రం ఈ ఏడాది దసరా కానుకగా విడుదలయ్యే అవకాశం ఉండగా, ప్రభాస్ త్వరలోనే ‘స్పిరిట్’ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించనున్నాడు. ఈ పోలీస్ యాక్షన్ డ్రామా 2027 మార్చిలో విడుదలవుతుందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

The submit ‘స్పిరిట్’ సెట్స్ లో అగ్ని ప్రమాదం.. ప్రభాస్ గురించి ఆరా తీస్తున్న ఫ్యాన్స్..! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.