Tue. Apr 21st, 2026

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే ఉస్తాద్ భగత్ సింగ్. గత నెల ఉగాది కానుకగా విడుదల అయ్యిన ఈ సినిమా అనుకున్న రేంజ్ సక్సెస్ అందుకోలేదు.

అయితే ఫైనల్ గా ఈ సినిమా నెల పూర్తి కాకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమాని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో నేటి నుంచి పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది.

సో పవన్ అభిమానులు మరోసారి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్, థమన్ లు సంగీతం అందించారు. అలాగే ఆర్ పార్ధిబన్ విలన్ గా నటించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

The submit ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.