ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌గా ఇంకా ఏ సినిమాను పట్టాలెక్కించలేదు. లోకేష్ కనగరాజ్ శిష్యుడు విఘ్నేష్ దర్శకత్వంలో రామ్ తన సోదరుడి నిర్మాణంలో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విఘ్నేష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆ స్థానంలో మరో దర్శకుడి కోసం అన్వేషణ మొదలైంది.
ఈ క్రమంలో రామ్ ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ కోసం పాట పాడి, రాసిన రామ్.. ఇప్పుడు ఏకంగా తన నెక్స్ట్ సినిమా కోసం ఒక కథను సిద్ధం చేసుకున్నాడట. తాను రాసుకున్న ఈ కథను వెండితెరపై ఆవిష్కరించగల సరైన దర్శకుడిని సెట్ చేసే పనిలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా కూడా రామ్‌తో ఒక భారీ సినిమా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే కొంతమంది దర్శకులు రామ్‌కు కథలు వినిపించినట్లు సమాచారం. మరి రామ్ నెక్స్ట్ మూవీ ప్రకటన కోసం అభిమానులకు ఇంకా ఎదురుచూపులు తప్పవా అనేది చూడాలి.
The submit ఎనర్జిటిక్ స్టార్‌కు ఎదురుచూపులు తప్పవా..? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.
