Tue. Apr 21st, 2026

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రాకా’ గురించి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన జానర్ నుండి షూటింగ్ వివరాల వరకు చిత్ర బృందం అత్యంత రహస్యంగా ఉంచుతోంది. గతేడాది షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా విడుదల తేదీపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

షూటింగ్‌లో జాప్యం జరుగుతోందని, అందుకే 2027లో ఈ సినిమా విడుదల కావడం కష్టమని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ తన షూటింగ్ పార్ట్‌ను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయనున్నాడు. ఈ సినిమాకు భారీ స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవసరమైనప్పటికీ, దర్శకుడు అట్లీ మాత్రం 2027 సెకండ్ హాఫ్‌లోనే సినిమాను విడుదల చేయాలని పక్కా ప్లానింగ్‌తో ఉన్నాడట. సరైన సమయంలో చిత్ర బృందం నుంచి విడుదల తేదీపై అధికారిక ప్రకటన రానుంది.

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే, జాన్వీ కపూర్, రష్మిక మందన్న మరియు మృణాల్ ఠాకూర్ వంటి స్టార్ హీరోయిన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంతమంది స్టార్స్ ఒకే సినిమాలో కనిపించబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం టీమ్ అంతా నిర్ణీత గడువులోగా షూటింగ్ పూర్తి చేయడంపైనే దృష్టి సారించింది.

The publish ‘రాకా’ రిలీజ్ పై సరికొత్త బజ్.. అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే..! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.