Tue. Apr 21st, 2026
VDxShouryuv : జూనియర్ ఎన్టీఆర్ కథతో విజయ్ దేవరకొండ సినిమా

జూనియర్ ఎన్టీఆర్‌తో అనుకున్న కథతో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నాడా? అంటే అవుననే మాట వినినిస్తోంది. ‘హాయ్ నాన్న’ వంటి ఎమోషనల్ హిట్ తర్వాత దర్శకుడు శౌర్యువ్ తన తదుపరి చిత్రాన్ని విజయ్ దేవరకొండతో చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ కథను శౌర్యువ్ ముందుగా ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. నిజానికి ‘హాయ్ నాన్న’ విడుదలైన తర్వాత శౌర్యువ్ ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను ఎన్టీఆర్‌కు వినిపించినట్టుగా వార్తలు వచ్చాయి.

కథ నచ్చడంతో ఎన్టీఆర్ కూడా ఆసక్తి చూపించాడని కానీ అప్పటికే ఆయన చేతిలో ‘దేవర’, ‘వార్ 2’, ప్రశాంత్ నీల్ సినిమాలు ఉండటంతో శౌర్యువ్‌ను వెయిటింగ్ మోడ్‌లో పెట్టాడనే టాక్ వచ్చింది. దీంతో.. శౌర్యువ్ అదే కథను విజయ్ దేవరకొండకు వినిపించగా ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. అయితే విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా శౌర్యువ్ ఈ స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇది కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా బలమైన ఎమోషన్స్ కలగలిసిన చిత్రమని సమాచారం. ‘హాయ్ నాన్న’ నిర్మించిన వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థే ఈ భారీ ప్రాజెక్ట్‌ను కూడా నిర్మించనుంది. ప్రస్తుతం విజయ్ తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే గతంలో గౌతమ్ తిన్ననూరితో విజయ్ చేసిన కింగ్డమ్ స్టోరీ కూడా.. మొదట రామ్ చరణ్ చేయాల్సింది. కానీ కుదరలేదు. ఇప్పుడు ఎన్టీఆర్‌తో అనుకున్న కథతో సినిమా అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.