Tue. Apr 21st, 2026

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ చిత్రమే “కింగ్”. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ యాక్షన్ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమా కోసం స్పెషల్ ప్లానింగ్ లు చేస్తున్నట్టు సాలిడ్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా కింగ్ కోసం ఇంటర్నేషనల్ పాప్ సింగర్ ఈడీ షీరన్ ని సంగీత దర్శకుడు అనిరుద్ దింపుతున్నట్టు తెలుస్తుంది.

పాప్ రంగంలో ఈడి షీరన్ ఎంత పాపులర్ అనేది అందరికీ తెలిసిందే. ఇపుడు తన నుంచి కింగ్ సినిమా కోసం స్పెషల్ సాంగ్ చేయడం అనేది క్రేజీ అంశమే అని చెప్పాలి. మరి అనిరుద్ ఎలాంటి సాంగ్ ని ప్లాన్ చేస్తున్నాడో చూడాలి. ఇది పాన్ వరల్డ్ లెవెల్లో ఎంత వరకు వర్క్ అవుతుందో కూడా చూడాల్సిందే మరి. ఇక ఈ అవైటెడ్ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

The publish షారుఖ్ ‘కింగ్’ కోసం ఇంటర్నేషనల్ పాప్ సింగర్? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.