Tue. Apr 21st, 2026

రాకింగ్ స్టార్ యష్ ‘కేజీయఫ్’ చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు. ఇక ‘కేజీయఫ్’ సిరీస్ చిత్రాల తర్వాత ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్’ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతోంది. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో యష్ ‘కేజీయఫ్ 3’ పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ప్రశాంత్ నీల్‌తో తాను ‘కేజీయఫ్ 3’ ఎప్పటికైనా తెరకెక్కిస్తానని.. అయితే, ప్రస్తుతం తాను టాక్సిక్, రామాయణ చిత్రాలతో బిజీగా ఉన్నానని.. రామాయణ రెండు భాగాలు పూర్తయిన తర్వాతే తాను ఇతర సినిమాలను ఓకే చేస్తానని యష్ చెప్పుకొచ్చాడు. దీంతో రామాయణ మూవీ ముగిసిన తర్వాతే ప్రశాంత్ నీల్‌తో కలిసి పక్కా స్క్రిప్టుతో ‘కేజీయఫ్ 3’ పట్టాలెక్కిస్తామని యష్ తెలిపాడు.

మొత్తానికి ‘కేజీయఫ్ 3’ పై యష్ పక్కా క్లారిటీతో ఉన్నాడని.. తాను ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు పూర్తయిన తర్వాతే ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తానని ఆయన చెప్పడంతో అభిమానులు ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

The put up ‘కేజీయఫ్ 3’ పై యష్ అప్డేట్.. వెయిటింగ్ తప్పదట..! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.