Wed. Apr 29th, 2026

ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న పలు గ్లోబల్ లెవెల్ చిత్రాల్లో రాకింగ్ స్టార్ యష్ హీరోగా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ చిత్రం టాక్సిక్ కూడా ఒకటి. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఆల్రెడీ ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా కానీ అలా ఒకో డేట్ మారుతూ జూన్ 4కి ఫైనల్ అయ్యింది. పోనీ ఇదైనా ఫైనల్ అనుకుంటే మళ్ళీ వాయిదా అనే రూమర్స్ వచ్చాయి.

ఇపుడు వాటికి అనుగుణంగానే సినిమా హీరో అలాగే నిర్మాత యష్ టాక్సిక్ ని ఈ జూన్ 4న విడుదల చేయడం లేదని అధికారికంగా రివీల్ చేశారు. అయితే ఇటీవల జరిగిన సినిమాకాన్ ఈవెంట్ లో టాక్సిక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది అని కానీ ఇలాంటి గ్లోబల్ లెవెల్ ప్రాజెక్ట్ ని అంతే రీతిలో డిస్ట్రిబ్యూషన్ చేసి విడుదల చేయాల్సి ఉంటుంది అని అందుకే మళ్ళీ ప్లాన్స్ మార్చి గ్లోబల్ లెవెల్లో అతి త్వరలోనే సినిమాని విడుదల చేస్తామని యష్ క్లారిటీ ఇచ్చాడు. దీనితో టాక్సిక్ విషయంలో అభిమానులు మరోసారి డిజప్పాయింట్ అయ్యారు.

The submit అఫీషియల్: యష్ ‘టాక్సిక్’ మళ్ళీ వాయిదా.. కారణమిదే! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.