Wed. Apr 29th, 2026
Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ నిత్యా మీనన్ అంటేనే ఒక డిఫరెంట్ బ్రాండ్. గ్లామర్ షోకి దూరంగా ఉంటూ కేవలం నటనతోనే మెప్పించే నిత్య, ప్రజంట్ మంచి కథలు ఎంచుకుంటు సైలెంట్ గా హిట్ కొడుతుంది. అయితే నిత్య తన వ్యాక్తిగత విషయాల గురించి ఎలాంటి బెరుకు లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. ముఖ్యంగా పెళ్ళి గురించి.. సాధారణంగా హీరోయిన్లు ఇలాంటి విషయాల మీద చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంటారు, కానీ నిత్య మాత్రం ఏమాత్రం మొహమాటం లేకుండా తన మనసులో మాట చెప్పేసింది.

నిత్య మాట్లాడుతూ.. ‘పిల్లలు కావాలనుకోవడం అనేది పూర్తిగా ఒక మహిళ వ్యక్తిగత నిర్ణయం.. దానికి పెళ్లితో సంబంధం లేదు. ఆధునిక కాలంలో సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది, పెళ్లి చేసుకోకుండానే తల్లి అయ్యే మార్గాలు చాలా ఉన్నాయి. నా శరీరం, నా జీవితం.. నిర్ణయం కూడా నాదే ఉండాలి’ అంటూ తన స్ట్రాంగ్ ఒపీనియన్‌ను బయటపెట్టింది. ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని, సింగిల్ లైఫ్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నానని నిత్య క్లారిటీ ఇచ్చింది. నిత్యా చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారు. ఏదేమైనా నిత్య మరోసారి తను ఎంత ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ అనేది ప్రూవ్ చేసుకుంది.