Sun. Jul 5th, 2026

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ సినిమా కరుప్పు కోసం అందరికీ తెలిసిందే. థియేటర్స్ లో సూర్య ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సాలిడ్ కంబ్యాక్ హిట్ గా ఈ సినిమా నిలిచింది. తెలుగులో కూడా వీర భద్రుడు గా వచ్చి మంచి వసూళ్లు రాబట్టింది.

అయితే ఈ సినిమాకి కూడా సీక్వెల్ కరుప్పు – గాడ్ వర్సెస్ పాలిటిక్స్ ని దర్శకుడు కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా ఎప్పుడు ఉండొచ్చు అసలు ప్లాన్ ఏంటి అనేది రివీల్ చేసాడు ఆర్కే బాలాజీ. కోలీవుడ్ వర్గాలు నుంచి సమాచారం ప్రకారం పార్ట్ 2 ఇప్పట్లో స్టార్ట్ చేసే అవకాశం లేదట.

ఆ సినిమా ఎలా చేయాలి అనేది కేవలం ఇప్పుడు ఉన్న పాలిటిక్స్ ఆధారంగానే తీయాల్సి ఉందని, ఇప్పుడే కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి తన సినిమా మొదలు కావడానికి ఇంకా సమయం ఉందని మంచి స్పైసీ అంశాలు దొరికితే అప్పుడు వాటి ఆధారంగా ప్లాన్ చేసుకుంటానని క్లారిటీ ఇచ్చాడు. సో ఈ సినిమాకి సీక్వెల్ ఇప్పట్లో ఉండదని ఖరారు అయ్యిపోయింది.

The publish ‘కరుప్పు 2’ పై దర్శకుడు ఇంట్రెస్టింగ్ క్లారిటీ! ఎప్పటి నుంచి మొదలవుతుంది అంటే.. first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.