సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, మన చిన్ననాటి జ్ఞాపకాల నేపథ్యంలో దర్శకుడు శ్రీకర్ రూపొందించిన చిల్డ్రన్ మూవీ ‘సమ్మర్ హాలిడేస్’ త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం నుండి తాజాగా ‘క్రష్ సాంగ్’ను హీరో ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్ ఆదిత్య హాసన్, ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘సమ్మర్ హాలిడేస్’ టీజర్ చూసినప్పుడు ఎమోషనల్ ఫీల్‌తో పాటు ఆనందభాష్పాలు వచ్చాయి. చిత్ర బృందంతో నాకు మంచి అనుబంధం ఉంది. నిర్మాత ధీరజ్ మొగిలినేని నా గత చిత్రాల తరహాలోనే మంచి టెక్నీషియన్లతో సాలిడ్ సెటప్‌తో ఈ సినిమాను నిర్మించారు. ‘90s’ వెబ్ సిరీస్ ఫేమ్ మాస్టర్ రోహన్ నటన చూసి స్ఫూర్తి పొంది ‘ఎపిక్’ మూవీ చేస్తున్నాను. దర్శకుడు శ్రీకర్ మంచి సబ్జెక్ట్‌తో తెరకెక్కించిన ఈ చిల్డ్రన్ మూవీ పెద్ద సక్సెస్ సాధించాలి. అలాగే ఇదే జూలైలో వస్తున్న నిర్మాత ఎస్‌కేఎన్ ‘చెన్నై లవ్ స్టోరీ’ కూడా ఘనవిజయం అందుకోవాలి.’ అని అన్నాడు.
ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ.. ‘చిన్నప్పుడు ‘లిటిల్ సోల్జర్స్’, ‘బాల భారతం’ లాంటి బాలల చిత్రాలు చూసేవాళ్లం. కానీ ఈ మధ్య అలాంటి సినిమాలు రావడం తగ్గిపోయిన తరుణంలో నిర్మాత ధీరజ్ ఈ జానర్‌లో ‘సమ్మర్ హాలిడేస్’ చేయడం చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ శ్రీకర్ మంచి సబ్జెక్ట్‌తో, సింజిత్ చక్కని మ్యూజిక్‌తో, అనురాగ్ కులకర్ణి గానంతో ఈ క్రష్ సాంగ్‌ను అద్భుతంగా తీసుకొచ్చారు. ’90s’ సిరీస్ ఫేమ్ రోహన్, ఖుషి, అరుణ్‌లకు ఈ సినిమాతో మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఆనంద్ దేవరకొండ చేస్తున్న ఎపిక్ మూవీ పెద్ద హిట్ కావాలి. అలాగే క్రష్ అనేది ఒక వ్యక్తిపై కాదు, కెరీర్‌పై పెట్టుకుంటే విజయాలు మన వెంటే వస్తాయి.’ అని అన్నారు.
డైరెక్టర్ ఆదిత్య హాసన్ మాట్లాడుతూ.. ‘ఈ క్రష్ సాంగ్ నా బాల్య స్మృతులను గుర్తుచేసింది. దర్శకుడు శ్రీకర్ ఒక మంచి ఎమోషనల్ స్టోరీతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కంటెంట్ చిత్రాలను నిర్మించే ధీరజ్ మొగిలినేనికి ఇది మరో సక్సెస్ ఫుల్ మూవీ కావాలి. సింజిత్ ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చారు. నా ‘90s’ వెబ్ సిరీస్ ఫేమ్ మాస్టర్ రోహన్‌తో పాటు ఖుషి, అరుణ్‌లకు ఈ సినిమాతో మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. ‘సమ్మర్ హాలిడేస్’ బ్లాక్ బస్టర్ కావాలి.’ అని అన్నారు.
ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. ‘దర్శకుడు శ్రీకర్ ఈ కథ చెప్పినప్పుడే చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అందరికీ నచ్చేలా ఒక మంచి సినిమాను రూపొందించామని నమ్ముతున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ మూడు చార్ట్‌బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు. లిరిసిస్ట్ కిట్టు విస్సాప్రగడ అద్భుతంగా రాయగా అనురాగ్ కులకర్ణి అంతే ప్యాషన్‌తో ఈ పాటను పాడారు. కథను నమ్మి ఎక్కడా వెనకాడకుండా భారీ ఖర్చుతో ఈ సినిమా నిర్మించాం. ‘90s’ సిరీస్ మేకర్ ఆదిత్య హాసన్, హీరో ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా ఈ సాంగ్ లాంచ్ చేయడం కరెక్ట్ అనిపించింది. చదువుకుంటున్నా షూటింగ్‌కు సహకరించిన పిల్లల తల్లిదండ్రులకు థ్యాంక్స్. హైదరాబాద్, అమలాపురం లాంటి లొకేషన్లలో షూటింగ్ చేసుకున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది.’ అని అన్నారు.
డైరెక్టర్ శ్రీకర్ మాట్లాడుతూ.. ‘మా టీమ్ అంతా కలిసి ఈ పాటను ఎంతో అందంగా డిజైన్ చేశాం. మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్, లిరిసిస్ట్ కిట్టు, సింగర్ అనురాగ్ కులకర్ణి, కొరియోగ్రాఫర్ లక్ష్మణ్ మాస్టర్ కలిసి ఈ క్రష్ సాంగ్‌ను అద్భుతంగా రూపొందించారు. చైల్డ్ ఆర్టిస్టులు రోహన్, ఖుషి ఎంతో డెడికేటెడ్‌గా వర్క్ చేశారు. నిర్మాత ధీరజ్ గారి సపోర్ట్ వల్లే ఈ బ్యూటిఫుల్ విజువల్స్ సాధ్యమయ్యాయి. ఈ పాటను లూప్‌లో విన్నట్లే, సినిమాను కూడా ప్రేక్షకులు రిపీటెడ్‌గా చూస్తారు.’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమల్లి, లిరిసిస్ట్ కిట్టూ విస్సాప్రగడ, కొరియోగ్రాఫర్ లక్ష్మణ్, రైటర్ కొండల్ రావు, ప్రొడ్యూసరి గిరిబాబు వల్లభనేని, సింగర్ అనురాగ్ కులకర్ణి, మాస్టర్ రోహన్, బేబి ఖుషి తదితరులు పాల్గొని మాట్లాడారు.
The publish ‘సమ్మర్ హాలిడేస్’లోని ‘క్రష్’ సాంగ్ లాంచ్ చేసిన ఆనంద్ దేవరకొండ..! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
