Sun. Jul 5th, 2026

రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ రిలీజ్ డేట్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమాను డిసెంబర్ 3న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి ప్రచారం జరుగుతున్నప్పటికీ, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై ప్రెషర్ పెరుగుతుంది.

ముందుగా కుదుర్చుకున్న ఓటిటి ఒప్పందాల ప్రకారం ఈ ఏడాది చివరలోపు సినిమాను రిలీజ్ చేయాల్సి ఉండటంతో, ప్రభాస్ ‘స్పిరిట్’ షూటింగ్‌లో పాల్గొంటూనే దీనిని కూడా వేగంగా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం కొన్ని పాటలు, ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ దాదాపు పూర్తయినట్లు సమాచారం. సరైన టైమింగ్‌లో వస్తే బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’, ‘పుష్ప 2’ రికార్డులను టార్గెట్ చేసే సత్తా ఈ చిత్రానికి ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

The submit ‘ఫౌజీ’పై పెరుగుతున్న ప్రెషర్.. ప్రభాస్ క్లారిటీ ఇస్తాడా..? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.