Sun. Jul 5th, 2026

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రమే “పెద్ది”. మంచి అంచనాలు నడుమ వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ సినిమా ఫైనల్ గా థియేటర్స్ లో రన్ ని పూర్తి చేసుకుంది. సరిగ్గా నెల రోజులు కితం ఇదే డేట్ లో విడుదల అయ్యిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి డేట్ ని ఫిక్స్ చేసుకుంది. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఇపుడు పెద్ది డేట్ ని అఫీషియల్ గా ప్రకటించారు.

పెద్ది ఓటిటి డేట్ ప్రకటించిన నెట్ ఫ్లిక్స్

ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా వచ్చిన పెద్ది సినిమా జులై 9 నుంచి అందుబాటులో ఉంటుంది అని నెట్ ఫ్లిక్స్ వారు ప్రకటించారు. కేవలం తెలుగు లోనే కాకుండా తమిళ్, కన్నడ సహా మలయాళ భాషల్లో కూడా సినిమా అందుబాటులో ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు.

ఓటిటిలోకి ఎక్స్ట్రా సీన్స్ తో?

థియేటర్స్ లో విడుదల అయ్యిన తర్వాత మేకర్స్ రీఎడిట్ చేసిన వెర్షన్ ని వదిలారు. అందులో కొన్ని ఎక్స్ట్రా సీన్స్ కూడా ఉన్నాయి. సో అదే ప్రింట్ ని విడుదల చేస్తారా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహించారు.

The publish Peddi OTT Date: ‘పెద్ది’ ఓటిటి డేట్ వచ్చేసింది.. బ్లాక్ బస్టర్ బ్యాటింగ్ ఎప్పుడంటే! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.