Sun. Jul 5th, 2026

దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా రాబోతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. కాగా ఈ చిత్రం 2026 జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అయితే, ఈ సినిమా ఫస్ట్ కాపీ ఇప్పటికే రెడీ అయిందని.. వచ్చే వారం
ఘట్టమనేని ఫ్యామిలీకి ముందుగానే స్పెషల్ షో వేస్తున్నారని తెలుస్తోంది. ఈ షోకి మహేష్ ఫ్యామిలీ కూడా హాజరు అవుతుందట. ఐతే, మహేష్ బిజీగా ఉన్నారట. కాబట్టి.. మహేష్ కి మరోసారి షో వేస్తారట. ఈ షోకి జయకృష్ణతో పాటు మిగిలిన తారాగణం కూడా జాయిన్ అవుతుందట.

కాగా అశ్వినీ దత్ సమర్పణలో, పి. కిరణ్ నిర్మాణంలో ‘చందమామ కథలు’ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. కాగా తిరుపతి నేపథ్యంలో హిందూ పుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వర ఆలయం చుట్టూ ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. విష్ణువు స్వయంభుగా అవతరించిన ఈ క్షేత్రంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ కథా నేపథ్యం సాగుతుందని.. ఈ సినిమా మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

The submit ‘శ్రీనివాస మంగాపురం’ స్పెషల్ షో.. వారికి మాత్రమే ? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.