Tue. Jul 14th, 2026

ఈ కొన్ని రోజులుగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి సంబంధించి ఓ ఊహించని వార్త ఓ పక్క సినీ వర్గాల్లో ఇంకోపక్క రాజకీయ వర్గాల్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొట్టేస్తున్న సంగతి తెలిసిందే. ఈ జూలై 18న ఎన్టీఆర్ పేరిట తన అభిమాన సంఘం రా ఎన్టీఆర్ (RAW NTR) అనే బృందం మీడియా ప్రెస్ మీట్ అంటూ ఇచ్చిన ప్రకటన అది తారక్ రాజకీయ రంగ ప్రవేశం కోసమే అంటూ ఇపుడు బజ్ వైరల్ గా మారింది.

కానీ ఫైనల్ గా ఈ రూమర్స్ పై స్వయంగా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చేసింది. అసలు ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదని వారు తేల్చేసారు. అసలు ఆ సంస్థకి ఎన్టీఆర్ కు సంబంధం లేదని ఎన్టీఆర్ పేరుతో ఎలాంటి ప్రకటనలు, కార్యక్రమాలు చేయడానికి వీలు లేదని తెలిపారు.

అలాగే ఒకవేళ ఏదైనా కార్యక్రమం అని సేవ అయినా, ప్రజా సంక్షేమం కోసం అయినా అది నేరుగా ఎన్టీఆర్ నుంచే అధికారిక ప్రకటన వస్తుంది అని సో ఇలా సర్క్యులేట్ అయ్యే వార్తలు నమ్మొద్దు అని వారు తేల్చేసారు. సో ఈ 18న జరిగే ప్రెస్ మీట్ కి ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీకి ఎలాంటి లింక్ లేదని ఇప్పుడు బిగ్ క్లారిటీ వచ్చేసింది.

The submit ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి బిగ్ క్లారిటీ.. పుకార్లపై అసలు నిజం ఇదే! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.