Tue. Jul 14th, 2026
OG 2: ‘ఓజీ 2’ పరిస్థితి ఏంటి?

వరుస ఫ్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్‌కు ‘ఓజీ’ ఊపిరి పోసింది. సినిమా సూపర్ హిట్ కాకపోయినా బ్రేక్ ఈవెన్ అయింది. వయలెన్స్ హద్దులు దాటినా, పవన్‌కి ఇచ్చిన ఎలివేషన్స్ ఫ్యాన్స్‌కు బాగా నచ్చాయి. పవన్ కెరీర్‌లో ఇంతవరకు 200 కోట్ల సినిమా కూడా లేదు, ‘ఓజీ’తో ఫస్ట్ టైమ్ 300 కోట్ల క్లబ్‌లో చేరాడు పవన్. ‘ఉస్తాద్’ ఫ్లాప్ తర్వాత రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో సినిమా ప్రకటించినా, ఇప్పట్లో ఉండేటట్టు కనిపించడం లేదు. నెక్స్ట్ నటించే సినిమా ‘ఓజీ 2’ అంటూ పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు.

అయితే, దర్శకుడు సుజిత్.. నానితో ‘బ్లడీ రోమియో’ మూవీకి కమిట్ అయ్యాడు. లేటెస్ట్‌గా పవన్‌కు ఆపరేషన్ జరగడంతో మూడు, నాలుగు నెలల వరకు రెస్ట్ తీసుకుంటాడని.. ఈ లెక్కన ‘ఓజీ 2’ ఇప్పట్లో ఉండదన్న ప్రచారం నడుస్తోంది. ‘ఓజీ’ రిలీజ్‌కు ముందే సుజిత్, నానితో ‘బ్లడీ రోమియో’ మూవీని అనౌన్స్ చేశాడు. అయితే నాని ‘పారడైజ్’తో బిజీగా ఉండడంతో సుజిత్ సినిమా పట్టాలెక్కలేదు. ‘పారడైజ్’ మూవీ ఇప్పట్లో పూర్తయ్యేటట్టు కనిపించడం లేదు. పవన్ కోలుకున్నాక ‘ఓజీ 2’ పూర్తి చేసిన తర్వాతే ‘బ్లడీ రోమియో’ తీయనున్నాడు సుజిత్.

పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేం. త్వరలోనే మరో భుజానికి కూడా ఆపరేషన్ చేయాల్సి ఉంది. మూడు నెలల పాటు రెస్ట్ తీసుకుంటాడా, లేదంటే ఆరు నెలలు తీసుకుంటాడో తెలీదు. గ్యాప్ ఎంత వచ్చినా ‘ఓజీ 2’ పూర్తయిన తర్వాతే సుజిత్ ‘బ్లడీ రోమియో’ తీస్తాడని తెలిసింది.