టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన పలు సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో దశాబ్దాలు దాటినా గుర్తుండే అతి కొద్ది చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ కంబ్యాక్ చిత్రం “గబ్బర్ సింగ్” కూడా ఒకటి. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో అంత్యాక్షరి గ్యాంగ్ అంటే తెలియని వారు తెలుగు సినిమాలో ఎవరూ ఉండరు.
అలా ఆ గ్యాంగ్ నటుల్లో కీలక నటుడు రమేష్ ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారనే వార్త ఇపుడు అభిమానులని ఎంతగానో కలవరపెడుతుంది. మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా కనిపించిన ఈ నటుడు ఆకస్మికంగా బ్రెయిన్ స్ట్రోక్ కి గురి కావడం అనేది తన సహచర నటుల్ని ఎంతో భావోద్వేగానికి లోను చేసింది.
దీనితో ఈ సీరియస్ విషయంలో హీరో పవన్ కళ్యాణ్ అలాగే దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ రమేష్ కుటుంబానికి సహచర నటులకి భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. రమేష్ కుటుంబానికి పవన్ కాల్ చేసి వారి ధైర్యం చెప్పి నేనున్నాను అనే భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూడా 2 లక్షల ఆర్ధిక సాయం అందించినట్టు నటులు తెలిపారు. ప్రస్తుతం రమేష్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
The publish ‘గబ్బర్ సింగ్’ రమేష్ కోసం పవన్, హరీష్ శంకర్ ల భరోసా! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
