Sat. Jul 25th, 2026

విడుదల తేదీ : జూలై 24, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియా, త్రిగుణ్, సిరి హనుమంతు తదితరులు
దర్శకత్వం : రవి నంబూరు
సంగీతం : మణిశర్మ
నిర్మాతలు : మాస్ మూవీ మేకర్స్ ,అమృత ప్రొడక్షన్స్
సినిమాటోగ్రఫీ : విశ్వాస్ డానియల్
ఎడిటింగ్ : సంతోష్ నాయుడు

సంబంధిత లింక్స్ : ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో రిలీజ్ కి ముందే కల్ట్ సినిమా అంటూ చెప్పుకొని విడుదలకి వచ్చిన సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ’. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు రవి నంబూరి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

మూడేళ్ళ పాటు ఎంతో గాఢంగా ప్రేమించిన అబ్బాయి అజయ్ (త్రిగుణ్) సరిగ్గా పెళ్లి ముందు తన నుంచి దూరం అయ్యాడని ఆ బాధని తట్టుకోలేక నివి (శ్రీ గౌరి ప్రియా) తాగుడుకు బానిస అవుతుంది. అలా చెన్నైలో తన ఫ్రెండ్స్ తో కలిసి బాధపడుతూ లైఫ్ లీడ్ చేస్తున్న తన లైఫ్ లోకి దర్శకుడు కావాలని కలలు గంటున్న ఓ అనాధ స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) వస్తాడు. అక్కడ నుంచి నివి లైఫ్ ఎలా టర్న్ అయ్యింది? స్టీవెన్ శంకర్ కోరుకున్న కల నెరవేరుతుందా లేదా? ఈ క్రమంలో నివి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది? ఆమె జీవితంలో జరిగిన ఓ ఫాంటసీ మార్పు ఏంటి? చివరికి ఈ ప్రేమకథ ఎలా ముగిసింది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలో సాయి రాజేష్ ఎంచుకున్న కోర్ ఎమోషనల్ పాయింట్ ఒకింత బాగుంది అనిపిస్తుంది. దానికి చిన్న ఫాంటసీ ఎలిమెంట్ ని జోడించి దానికి అనుగుణంగా రాసుకున్న కొన్ని సీన్స్ వాటిని ఎస్టాబ్లిష్ చేసిన తీరు బాగున్నాయి. ఈ క్రమంలో ప్లాన్ చేసుకున్న కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ మాత్రం అక్కడక్కడా ఆకట్టుకుంటాయి.

కిరణ్ అబ్బవరంపై ఫస్టాఫ్ ఇంకా సెకండాఫ్ లో కొన్ని సీన్స్ చూసే ఆడియెన్స్ ని కదిలిస్తాయి. అలానే తన రోల్ లో కిరణ్ కూడా చాలా బాగా చేసాడు. తన ఎస్ ఆర్ కళ్యాణ మండపంలో చేసిన ఎమోషనల్ పెర్ఫామెన్స్ కంటే మెరుగ్గా ఇందులో తన రోల్ ని చేసాడు. అందులోని అమాయకత్వం, కామెడీ టైమింగ్ వంటివి బాగా చేసాడు.

ఇక తనతో పాటుగా హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియా కూడా అంతకు మించి పెర్ఫామెన్స్ ని ఆమె చేసింది అని చెప్పొచ్చు. మొదట్లో కొంచెం ఇబ్బంది పెట్టినా కొన్ని సీన్స్ లో మాత్రం ఆమె అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. సెకండాఫ్ లో శ్మశాన వాటిక వద్ద చేసిన ఒక్క సీన్ మాత్రం ఆమె తన నటనతో సినిమాలో సాలిడ్ హైలైట్ గా నిలిపింది. అలానే క్లైమాక్స్ పార్ట్ లో కూడా ఆమె బాగా చేసింది.

వీరితో పాటుగా త్రిగుణ్ కూడా బాగా చేసాడు. ఇతర నటీనటుల సహకారం కూడా బాగుంది. ఇందులో ఇంకో ప్రధాన బలం పాటలు, నేపథ్య గీతం అని చెప్పవచ్చు. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో డెప్త్ ని ఇవి బాగా హైలైట్ చేసాయి.

మైనస్ పాయింట్స్:

కేవలం ఒక్క కోర్ పాయింట్ ఒక్కటీ బాగుంటే కాదు దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకునే కథనం కూడా బాగుండాలి. కానీ ఇదే ఇందులో కొంచెం మిస్ ఫైర్ అయ్యింది. దాదాపు మూడు గంటల నిడివితో వచ్చిన ఈ సినిమా అక్కడక్కడా కొన్ని సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి తప్పితే మిగతా కథనం అంతా చాలా రొటీన్ గా ఊహాజనితంగానే సాగుతుంది. సో అంత ఎగ్జైటింగ్ గా ఎక్కడా అనిపించదు.

అంతేకాకుండా హీరోయిన్ రోల్ ని ఓ తాగుబోతుగా చిత్రీకరించడం దానిని డ్రాగ్ చేయడం ఇవన్నీ అనవసరం అనిపిస్తుంది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ కాకపోవచ్చు. అలానే ఆమెకి త్రిగుణ్ కి పెట్టిన ఆ లవ్ ట్రాక్ కూడా వీక్ గా ఉంది. మూడేళ్ళ గాఢమైన ప్రేమ, అతడికి చివరి నిమిషంలో క్లారిటీ లేకపోవడం అందుకు విడిపోవడం ఇవన్నీ చాలా సిల్లీగా అనిపిస్తాయి.

సెకండాఫ్ కి ఒక సాలిడ్ ఎస్టాబ్లిష్మెంట్ ని సెటప్ చేసిన తర్వాత కథనం అలా రొటీన్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోతుంది. దీనితో అక్కడ నుంచి పరిస్థితులు నెక్స్ట్ ఏం జరుగుతుంది? సీన్ ఏంటి అనేవి జెనరల్ ఆడియెన్స్ కి కూడా ముందే తెలిసిపోయే విధంగానే ఉంటాయి.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. మణిశర్మ ఇచ్చిన సంగీతం ప్లస్ అయ్యింది. పాటలు బాగున్నాయి. అలాగే నేపథ్య సంగీతం కూడా సినిమాలో బాగుంది. విశ్వాస్ డానియల్ ఇచ్చిన కెమెరా వర్క్ బాగుంది. చెన్నై నేపథ్యాన్ని బాగా చిత్రీకరించారు. సంతోష్ నాయుడు ఎడిటింగ్ పర్వాలేదు కానీ కొన్ని ల్యాగ్ సీన్స్ ని తగ్గించాల్సింది.

ఇక దర్శకుడు రవి నంబూరి విషయానికి వస్తే.. సాయి రాజేష్ ఇచ్చిన కథ, కథనాల్లో దర్శకునిగా తన వంతు ప్రయత్నం సిన్సియర్ గానే చేశారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ ని తాను తెరకెక్కించిన తీరు ఇందులో బాగుంది. కాకపోతే కథనం ఒక సమయం తర్వాత రొటీన్ అయ్యిపోయేసరికి తన దర్శకత్వం ద్వారా కూడా చేయడానికి ఏమి లేదు. సో తన వర్క్ వరకు మాత్రం తాను బానే చేసారని చెప్పొచ్చు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘చెన్నై లవ్ స్టోరీ’ ఒక డీసెంట్ గా సాగే ఎమోషనల్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. బేబి లాంటి సెన్సిబుల్ లవ్ డ్రామా తర్వాత అదే నిర్మాతల కలయికలో వచ్చిన ఈ సినిమా యువతని ఆకట్టుకుంటుంది. ఇందులో యునిక్ లవ్ కాన్సెప్ట్ అందులో ఎమోషనల్ పార్ట్ వారిని ఆకట్టుకుంటుంది. అలాగే కిరణ్, గౌరీ ప్రియా పోటాపోటీగా సాలిడ్ పెర్ఫామెన్స్ లు చేశారు. కానీ సెకండాఫ్ కొంచెం డల్ అయ్యింది. మూమెంటం ఫుల్ ఫ్లెడ్జ్ గా సాగితే ఇంపాక్ట్ మరింత బాగుండేది. ఇది పక్కన పెడితే ఈ సినిమా థియేటర్స్ లో డీసెంట్ ట్రీట్ ఇస్తుంది.

123telugu.com Score: 3/5

Reviewed through 123telugu Group

Click on Right here For English Evaluate

    

Ebook your film tickets in India

 

 

The publish సమీక్ష: ‘చెన్నై లవ్ స్టోరీ’ – ఇంప్రెస్ చేసే లవ్, ఎమోషనల్ డ్రామా first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.