Sat. Jul 25th, 2026

ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి పూర్తిగా హాలీవుడ్ లెవెల్లో వస్తున్న సినిమాలు మాత్రం రెండే ఉన్నాయని చెప్పాలి. ఒక మన తెలుగు సినిమా నుంచి వస్తున్న ‘వారణాసి’ మరో చిత్రం బాలీవుడ్ నుంచి వస్తున్న భారీ చిత్రం ‘రామాయణ’. రెండూ హిస్టారికల్ నేపథ్యంలో వస్తున్న సినిమాలే కావడం పైగా ఐమ్యాక్స్ వెర్షన్ లో వస్తున్న సినిమాలు కావడం విశేషం.

అయితే ఈ రెండు సినిమాలు కూడా హాలీవుడ్ లో కూడా భారీ ఎత్తున విడుదల కావాలి అంటే అక్కడి పాపులర్ సంస్థల తోనే కలవాల్సిన పరిస్థితి ఉండాలి. ఇది వరకు ఎన్నెన్నో సినిమాలకి ఇలా హాలీవుడ్ కొలాబరేషన్ వంటివి కేవలం టాక్ వరకు మాత్రమే పరిమితం అయ్యాయి. కానీ మొదటిసారి రామాయణ మేకర్స్ సోనీ లాంటి భారీ సంస్థతో టై అప్ కావడం కేజ్రీగా మారింది.

సో రామాయణ మేకర్స్ బిగ్ స్టెప్ తీసేసుకున్నారు. ఇప్పుడు అందరి కళ్ళు వారణాసి పై పడ్డాయి. గ్లోబల్ లెవెల్లో వారణాసి బృందం కంటే రాజమౌళి ఫ్యాక్టర్ ఒకింత ఎక్కువే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో వారణాసి చిత్రానికి కూడా డెఫినెట్ గా ఓ భారీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ యాడ్ అవ్వాల్సిందే. కానీ అదెవరు అనేది ప్రశ్నగా మారింది. సో దీనిపై మరింత క్లారిటీ ముందు రోజుల్లో రావాల్సి ఉంది.

The publish ‘రామాయణ’ బిగ్ స్టెప్.. ‘వారణాసి’కి అంతకు మించి చేయాల్సిందే! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.