Tue. Apr 21st, 2026
Aditya Dhar: అతను నాకు తమ్ముడు లాంటి వాడు.. శాశ్వత్ సచ్‌దేవ్‌పై ఆదిత్య ధర్ ప్రశంసలు!

రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్ 2’ ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాకు శాశ్వత్ సచ్‌దేవ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించాయి. తాజాగా దర్శకుడు ఆదిత్య ధర్ తన ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా శాశ్వత్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. “కొన్ని కొల్లాబరేషన్స్ కేవలం పనితోనే ముగిసిపోవు, అవి వ్యక్తిగతంగా మారిపోతాయి. శాశ్వత్ నాకు కేవలం సంగీత దర్శకుడు మాత్రమే కాదు, నా సొంత తమ్ముడు లాంటి వాడు. మేమిద్దరం కలిసి ఎన్నో ఆలోచనలు, నిశ్శబ్దాలు, తీవ్రమైన చర్చలను పంచుకున్నాం” అంటూ ఆదిత్య ధర్ ఎమోషనల్ అయ్యారు.

Additionally Learn : NTR Dragon: తారక్ ‘డ్రాగన్’ అవతారం.. 3000 ఏళ్ల నాటి యుద్ధ విద్యలో ఎన్టీఆర్ కఠిన శిక్షణ!

వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ చిత్రానికి కూడా శాశ్వత్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఇప్పుడు ‘ధురంధర్ 2’ తో ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేశారు. ముఖ్యంగా జమీల్ జమాలీ పాత్రకు సంబంధించిన మ్యూజిక్ బిట్స్, థీమ్ సాంగ్స్ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. శాశ్వత్ సచ్‌దేవ్ తన పని పట్ల చూపించే అంకితభావం వల్లే ఈ స్థాయిలో అవుట్‌పుట్ వచ్చిందని ఆదిత్య ధర్ కొనియాడారు. రణవీర్ సింగ్ అభిమానులు కూడా ఈ మ్యూజిక్ ఆల్బమ్‌ను లూప్‌లో వింటూ, నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.