మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ (Peddi )చిత్ర రిలీజ్ డేట్ మారనున్నట్లు తెలుస్తుంది. తొలుత ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయాలని చిత్ర బృందం భావించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జూన్ చివరి వారంలో వేసవి సెలవుల కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందట. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మరోవైపు, అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం కూడా వాయిదా పడనుంది. వాస్తవానికి మే 1న విడుదల కావాల్సిన ఈ సినిమా, ‘పెద్ది’తో పోటీని నివారించేందుకు జూన్ 25కి మార్చబడింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ సినిమా కూడా అదే సమయానికి వస్తుండటంతో, అఖిల్ సినిమాను మరోసారి వాయిదా వేయాలని నిర్మాతలు నిర్ణయించారు. కేవలం ‘పెద్ది’తో బాక్సాఫీస్ క్లాష్‌ను తప్పించుకోవడానికే ‘లెనిన్’ రెండోసారి వాయిదా పడటం గమనార్హం.
మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లెనిన్’ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘పెద్ది’ చిత్ర కొత్త విడుదల తేదీ ఖరారైన వెంటనే, ‘లెనిన్’ టీమ్ తమ కొత్త రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనుంది.
The publish ‘పెద్ది’ ఎఫెక్ట్.. మరోసారి వాయిదా పడనున్న ‘లెనిన్’..! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
