Tue. Apr 21st, 2026

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా, దర్శకుడు అట్లీతో ఆయన చేయబోయే భారీ ప్రాజెక్ట్ ‘రాక’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో బన్నీ మునుపెన్నడూ లేని విధంగా గుండుతో, శరీరం నిండా వెంట్రుకలతో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముఖంపై పదునైన గోళ్లతో కూడిన చేతిని పెట్టుకున్న ఆయన లుక్ చూస్తుంటే, ఇందులో ఏదో ఒక అతీత శక్తి లేదా జంతు లక్షణాలు ఉన్న పాత్రను ఆయన పోషిస్తున్నారని స్పష్టమవుతోంది. అయితే ఈ సినిమా టైటిల్ ప్రభాస్ నటించిన ఓ సినిమాతో సంబంధం ఉందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

​సంస్కృతంలో ‘రాక’ అంటే ‘పౌర్ణమి’ అని అర్థం. ప్రభాస్ కెరీర్ లో మంచి మ్యూజికల్ హిట్ మూవీగా ‘పౌర్ణమి’ మూవీ నిలిచింది. ఇప్పుడు అదే అర్ధం వచ్చే సంస్కృత టైటిల్ తో బన్నీ రావడం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రెండు సినిమాలకు ఏదైనా పాయింట్ పోలీవుంటుందా అనేది చూడాలి.

​మరోవైపు, ఇది ఒక సైన్స్ ఫిక్షన్ చిత్రమని, మానవ డిఎన్ఏ మార్పుల వల్ల చంద్రుడి గమనాన్ని బట్టి మనిషి ఒక క్రూరమైన ప్రాణిగా మారే కథాంశంతో అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. పోస్టర్‌లో గోళ్ల చేయి చంద్రుడిని తాకుతున్నట్లు చూపించడం ఈ మిస్టరీని మరింత పెంచింది. మొత్తానికి ఇన్ని పోలికలతో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

The put up ఏంటి.. అల్లు అర్జున్ ‘రాక’ ప్రభాస్ ఎప్పుడో తీసుకొచ్చాడా..? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.