విడుదల తేదీ : జూన్ 19, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : ఆధిషేషన్, ఫర్జనా పలతింగల్, ముహమ్మద్ జినన్, డాలీ జూన్, టోవినో థామస్, జీన్ పాల్ లాల్, గిరిష్ ఏడి & బీనా ఆంటోనీ
దర్శకత్వం : చిదంబరం
నిర్మాతలు : వెంకట్ కె నారాయణ, షైల్జా దేశీ ఫెన్
సంగీతం : సుషిన్ ష్యామ్
ఛాయాగ్రహణం : షిజు ఖలీద్
కూర్పు: వివేక్ హర్షన్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లో విడుదలకి వచ్చిన తాజా చిత్రం బాలన్ – ది బాయ్ కూడా ఒకటి. మలయాళ సెన్సేషనల్ హిట్ మంజుమ్మల్ బాయ్స్ దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి.
కథ:
కన్నూర్ ప్రాంతంలోని ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి, తన చిన్నారి కొడుకు (అధిశేషన్) తో బయటకు వచ్చిన తల్లి (ఫర్జానా) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. విడుదలయ్యాక, వారు తమ గుర్తింపులను మారుస్తూ, ఊళ్లు మారుతూ జీవిస్తుంటారు. తల్లి చెప్తున్న అబద్ధపు కథలను నిజమని నమ్మే కుమారుడికి, అసలు వాళ్ళు ఎందుకు అలా జీవిస్తున్నారో అర్ధం కాదు. ఇలా ఒకరోజు ఓ వృద్ధురాలి దగ్గర కేర్ టేకర్ గా చేరినప్పుడు, ఆమె గతానికి సంబంధించిన ఒక వ్యక్తి ఎదురుపడతాడు. అసలు వారి గతం ఏమిటి? తన తల్లి ఎందుకు అలా జీవిస్తోంది? కొడుకు ఆ నిజం తెలుసుకున్నాడా? అన్నదే మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని రొటీన్ రెగ్యులర్ థ్రిల్లర్ లతో పోలిస్తే సినిమా కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కథాంశం సింపుల్ గానే అనిపించినా, జిత్తు మాధవన్ అందించిన స్క్రీన్‌ప్లే సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. నెమ్మదిగా సాగే ఈ కథనంలో, ప్రేక్షకులను పాత్రల ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు.
అలాగే కథ ఒక దిశలో సాగుతుందనుకుంటే, ఊహించని మలుపులు తిరుగుతుంది. ఇంటర్వెల్ బ్లాక్, సెకండాఫ్‌లోని పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ మరియు క్లైమాక్స్ ట్విస్ట్ చాలా అద్భుతంగా ఉన్నాయి.
చిన్నారి నటుడు ఆధిశేషన్ కె.ఆర్ అద్భుతమైన నటన కనబరిచాడు. తన కళ్లతోనే ఎమోషన్స్‌ని పలికించిన తీరు సినిమాలో మెప్పిస్తుంది. ఇక తల్లి పాత్రలో ఫర్జానా పలథింగల్ నటన సినిమాకు ప్రాణం పోసింది. ఆమె పాత్రలోని వైవిధ్యం, భావోద్వేగాల లోతు కథను మరో స్థాయికి తీసుకెళ్లాయి. టోవినో థామస్ తన ఎక్స్‌టెండెడ్ క్యామియోతో ఆకట్టుకున్నాడు. వీరితో పాటుగా ఇతర నటీనటులు సహజమైన నటనతో ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్:
సినిమాకు అతిపెద్ద మైనస్ ఏదన్నా ఉంది అంటే అది సాగదీతతో కూడిన కథనమే అని చెప్పాలి. కథానుగుణంగా నిదానంగా సాగినా, కొన్ని సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. మొత్తం 147 నిమిషాల నిడివితో వచ్చిన ఈ సినిమా, అక్కడక్కడా సాగదీసినట్లు అనిపిస్తుంది. ఎడిటింగ్ లో వీటిని సరిచేయాల్సింది.
సాంకేతిక విభాగం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. సంగీతం, కెమెరా వర్క్ లు కూడా బాగున్నాయి. ట్రైలర్ సమయంలో డబ్బింగ్ పరంగా వచ్చిన విమర్శలు కరెక్ట్ చేసుకొని నీట్ గా ప్రెజెంట్ చేశారు. ఎడిటింగ్ కొన్ని సీన్స్ వరకు ఇంకొంచెం బెటర్ గా కట్ చేయాల్సింది.
ఇక దర్శకుడు చిదంబరం నుంచి మరో సాలిడ్ వర్క్ గా బాలన్ కోసం చెప్పొచ్చు. తనకి జిత్తు మాధవన్ అందించిన స్క్రీన్ ప్లే మరింత బలాన్ని చేకూర్చింది. కథనం కొన్ని చోట్ల స్లోగా నడిపించారు కానీ ఒక రెగ్యులర్ థ్రిల్లర్ గా కాకుండా ఊహించని విధంగా దీనిని డిజైన్ చేయడంలో వారు సక్సెస్ అయ్యారు.
తీర్పు:
ఇక మొత్తం మీద ‘బాలన్: ది బాయ్’, ఒక డీసెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ గా నిలుస్తుంది. నటీనటులు అధిశేషన్ మరియు ఫర్జానా తమ పాత్రలకు ప్రాణం పోశారు. అలాగే చిదంబరం టేకింగ్, మాధవన్ ల స్క్రీన్ ప్లే లు ఈ సినిమాను నిలబెట్టాయి. కొన్ని చోట్ల కథనం సాగదీశారు కానీ కొత్తగా ప్రయత్నించే సైకలాజికల్ థ్రిల్లర్‌లను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక మంచి ట్రీట్ ఇస్తుంది. సో ఈ వీకెండ్ లో ఈ సినిమాని ట్రై చెయ్యండి.
123telugu.com Ranking: 3/5
Reviewed via 123telugu Workforce
Click on Right here For English Assessment
The publish సమీక్ష: బాలన్ – ది బాయ్ – ఆకట్టుకునే సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
