మలయాళ సినిమా దగ్గర బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన సీనియర్ నటుడు మోహన్ లాల్ హీరోగా నటించిన ఎన్నో సెన్సేషనల్ హిట్స్ లో దృశ్యం సిరీస్ కూడా ఒకటి. దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ క్రేజీ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కి ఇపుడు మూడో భాగం వచ్చి ఇది కూడా భారీ వసూళ్లు రాబట్టింది.
ఇలా థియేటర్స్ లో రికార్డులు సెట్ చేసిన ఈ సినిమా ఫైనల్ గా ఓటిటి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని కూడా పాపులర్ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారే సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఈ జూన్ 18 నుంచి అందుబాటులో ఉండనున్నట్టుగా ఇప్పుడు అధికారికంగా అనౌన్స్ చేసేసారు.
సో ఇది మాత్రం మోహన్ లాల్ అభిమానులకి దృశ్యం సిరీస్ ఫ్యాన్స్ కి బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. మలయాళంలో సూపర్ హిట్ అయ్యిన ఈ సినిమా తెలుగులో మాత్రం ప్లాప్ గానే మిగిలిపోయింది. ప్రస్తుతం అయితే ఒక్క మలయాళం లోనే సినిమా వస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగు, ఇతర డబ్బింగ్ వెర్షన్ లపై క్లారిటీ రావాల్సి ఉంది.
View this put up on Instagram
The put up Drishyam 3 OTT Date: ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న బ్లాక్ బస్టర్ ‘దృశ్యం 3’.. ఎప్పుడు? ఎందులో అంటే! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
