ఓటీటీ వేదిక : ఈటీవీ విన్
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : జూన్ 14, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, అనిష్ కురివిల్లా, పవన్ రమేష్, సునందిని తదితరులు
దర్శకత్వం : రోహిత్ పెనుమత్స
నిర్మాత : కిషోర్ మారిశెట్టి
సంగీతం : వివేక్ సాగర్
ఛాయాగ్రహణం : శశాంక్ రాఘవుల
కూర్పు : అవంతి రుయా
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో ప్రసారం అవుతున్న వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి లేటెస్ట్ గా వచ్చిన మరో లఘు చిత్రమే ‘ఇల్లు’. ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
హైదరాబాద్ సిటీలో ఒక ఆర్టికల్ రచయితగా పని చేసే కృష్ణ ప్రసాద్ (హర్షవర్ధన్) ఒక అద్దె ఇంట్లో దాదాపు పదేళ్ల నుంచి అద్దెకు ఉంటూ సోలోగానే కానీ ఎంతో ప్రశాంతంగా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. కానీ ఓరోజు తన ఇంటి యజమాని తన కొడుకు విదేశాల నుంచి వస్తున్నాడని తనకి ప్రసాద్ ఉంటున్న ఇల్లు అణువుగా ఉంటుందని వేరే ఇల్లు చూసుకొని ఈ ఇంటికి ఖాళీ చేయాలని కోరుతారు. దీనితో ప్రసాద్ కి ఎంతో ఇష్టమైన ఆ ఇంటిని వదులుకుంటాడా లేదా? ఏ ఇంట్లోని సంవత్సరానికి మించి ఉండని ప్రసాద్ పదేళ్లకు పైగా అనుబంధం ఉన్న ఆ ఇంటిని వదులుకుంటాడా? చివరికి ఏమైంది అనేది తెలియాలి అంటే ఈ లఘు చిత్రం చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ లఘు చిత్రం అందరికీ బాగా కనెక్ట్ అవుతుందని చెప్పే కంటే ఒక ఇంటితో అది సొంతిల్లు అయినా అద్దె ఇల్లు అయినా ఎన్నో ఏళ్ళు పాటుగా ఉంటున్న వారికి ఒక సర్వ సాధారణ మధ్య వయస్కులకి బాగా కనెక్ట్ అవుతుంది అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సాగే ఈ డ్రామా డీసెంట్ గా చాలా రిఫ్రెషింగ్ గా సాగిపోతుంది. తన పాత్రలో హర్షవర్ధన్ చాలా నాచురల్ గా చేశారు. ఒకింత ఇది తన పర్శనల్ లైఫ్ కి కూడా దగ్గరగా ఉండే పాత్ర లానే కనిపిస్తుంది. అందుకే తనలో మరింత సహజత్వం కనిపించింది.
సిటీలో ఒక అద్దె ఇల్లు దొరకటం ఎంత కష్టం, దాని కోసం పడే ఇక్కట్లు, ఆల్రెడీ ఉంటున్న ఇంటితో ఉండే అటాచ్మెంట్ వంటి వాటిని దర్శకుడు కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇక ఇందులో కథనం పెద్దగా బోర్ అనిపించకుండా వివేక్ సాగర్ సంగీతం మాత్రం మంచి రిఫ్రెషమెంట్ ని అందిస్తుంది. ఇది అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు.
వీటితో పాటుగా క్లైమాక్స్ లో ఇచ్చిన ఎమోషనల్ గుడ్ ఎండింగ్ ఈ చిత్రానికి ఒక నిండుతనాన్ని తీసుకొచ్చి చూసే ఆడియెన్ మనసుకి తేలికగా అనిపించేలా చేస్తుంది. ఇక హర్షవర్ధన్ తో పాటుగా ఇతర నటీనటులు బిందు చంద్రమౌళి, అనిష్ కురివిల్లా, పవన్ రమేష్, సునందినిలు మంచి సపోర్ట్ రోల్స్ లో కనిపించి ఇంప్రెస్ చేశారు.
మైనస్ పాయింట్స్:
ఈ చిత్రం మొదట చెప్పినట్టు గానే మరీ రెగ్యులర్ ఆడియెన్స్ కి పూర్తి స్థాయిలో కనెక్ట్ కాకపోవచ్చు. ఇందులో కనిపించే సింపుల్ కాన్సెప్ట్, మొదటి కొంతసేపు కథనం మాత్రం కొద్దిగా డల్ గా అనిపిస్తుంది. కొంచెం కొత్త కొత్త కాన్సెప్ట్ లు హెవీ ట్విస్ట్ లు లాంటివి ఆశించేవారికి కూడా ఈ లఘు చిత్రం దూరం. అలానే కథపై ఓ ఐడియా ఉంటుంది కాబట్టి కథనం ఊహాజనితంగానే సాగుతుంది. సో ఇలాంటివి అన్నీ ఒకింత రొటీన్ గానే అనిపిస్తుంది.
సాంకేతిక వర్గం:
ఇందులో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. వివేక్ సాగర్ సంగీతం ఈ చిత్రంకి సోల్ గా నిలిచింది. కథనం మొత్తాన్ని తన సంగీతంతో మంచి మూడ్ లోకి తాను మార్చారు. కెమెరా వర్క్, ఎడిటింగ్ లు కూడా డీసెంట్ అని చెప్పొచ్చు. ఇక దర్శకుడు రోహిత్ పెనుమత్స విషయానికి వస్తే.. తన వర్క్ డీసెంట్ గా ఉంది. ఒక సింపుల్ కాన్సెప్ట్ ని ఎక్కడా పెద్దగా డీవియేట్ కాకుండా బ్యూటిఫుల్ గా నడిపించారు. నటీనటుల ఎంపిక కొన్ని సింబాలిక్ సీన్స్ ని డిజైన్ చేసుకున్న విధానం బాగుంది. ఓవరాల్ గా తన వర్క్ మెప్పిస్తుంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘ఇల్లు’ అనే లఘు చిత్రం ఒక డీసెంట్ ఫ్యామిలీ డ్రామాగా నిలుస్తుంది. ఇంటితో ఎవరికి మమకారం ఉండదు చెప్పండి? అది సొంతిల్లు అయినా అద్దె ఇల్లు అయినా ఆ ఎమోషన్ ని దర్శకుడు క్యారీ చేసిన విధానం అలానే ఇందులో అందరి నటీనటుల పెర్ఫామెన్స్ లు, వివేక్ సాగర్ సంగీతంలు మరింత నాచురాలిటీ తీసుకొచ్చాయి. కాకపోతే సింపుల్ కథా, కథనాలు లాంటివి పక్కన పెడితే ఓ ప్లెజెంట్ డ్రామాలు చూడాలి అనుకునేవారు ఈటీవీ విన్ లో ట్రై చెయ్యొచ్చు.
123telugu.com Score: 2.75/5
Reviewed by way of 123telugu Staff
The publish ఓటీటీ సమీక్ష: ‘ఇల్లు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
