Thu. Jun 25th, 2026
Fifa World Cup: ఫుట్‌బాల్ ప్రేమికులకు పండగే: జీ5లో ఫిఫా వరల్డ్ కప్ 2026 రచ్చ

భారతదేశంలో ఫుట్‌బాల్ క్రేజ్ సరికొత్త శిఖరాలను తాకబోతోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన క్రీడా సంబరం ‘ఫిఫా వరల్డ్ కప్ 2026’ జీ5 వేదికగా భారతీయ ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్ 11 నుంచే ఈ ఫుట్‌బాల్ మహాసంగ్రామానికి సంబంధించిన లైవ్ యాక్షన్, హైలైట్స్, ప్రత్యేక విశ్లేషణలు జీ5 యాప్‌లో ప్రత్యక్షం కానున్నాయి. డిజిటల్ సాంకేతికత, హై-క్వాలిటీ స్ట్రీమింగ్‌తో కోట్లాది మంది అభిమానులకు స్టేడియంలో కూర్చుని మ్యాచ్ చూస్తున్న అనుభూతిని కలిగించడానికి జీ5 అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వివిధ రకాల డివైజ్‌ల ద్వారా ఎక్కడ ఉన్నా, ఎప్పుడైనా ఈ మ్యాచ్‌లను వీక్షించే సౌలభ్యాన్ని కల్పిస్తోంది.

అలానే దీన్ని రసవత్తరంగా మార్చేందుకు జీ5 ఒక క్రేజీ అప్‌డేట్‌ను ప్రకటించింది. భారత ఫుట్‌బాల్ లెజెండ్, మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా జీ5 ఎక్స్‌పర్ట్ ప్యానెల్‌లో చేరారు. దేశంలో ఫుట్‌బాల్ ఆటపై చెరగని ముద్ర వేసిన భూటియా.. తన సుదీర్ఘ అనుభవం, వ్యూహాత్మక చతురతతో మ్యాచ్‌లకు సంబంధించిన లోతైన విశ్లేషణలను అభిమానులకు అందించనున్నారు. జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఫిఫా మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందంలో భాగంగా 2034 వరకు అన్ని ప్రధాన ఫిఫా టోర్నమెంట్లు జీ5, యునైట్ 8 వేదికలపై ప్రసారం కానున్నాయి. ఇందులో 2026 వరల్డ్ కప్‌తో పాటు.. ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ 2027, ఫిఫా వరల్డ్ కప్ 2030 వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలు కూడా ఉన్నాయి. ఈ ఆటను ఆస్వాదించేందుకు వీలుగా.. ఇంగ్లీష్, హిందీ, బెంగాళీ, మలయాళం భాషల్లో సమగ్ర కవరేజ్‌ను అందించనున్నారు. ఇక ఆలస్యం ఎందుకు? జూన్ 11 నుండి జీ5 స్క్రీన్లపై మీ ఫేవరెట్ జట్ల ‘ఫిఫా’ సమరాన్ని చూసి ఎంజాయ్ చేయండి!