Thu. Jun 25th, 2026

ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : జూన్ 23, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : అమోల్ పరాశర్, ఆనందేశ్వర్ ద్వివేది, ఆకాష్ మఖిజా, ఆకాంక్ష రంజన్ కపూర్, వినయ్ పాఠక్, దినేష్ లాల్ యాదవ్ తదితరులు
దర్శకులు : లలితం ఆనంద్
నిర్మాతలు : టీవీఎఫ్ (TVF)
సంగీతం : రోహిత్ శర్మ
ఛాయాగ్రహణం : గిరీష్ కాంత్
కూర్పు : చంద్రశేఖర్ ప్రజాపతి

సంబంధిత లింక్స్ : ట్రైలర్

ఒక ఏడాది గ్యాప్ తర్వాత ‘గ్రామ్ చికిత్సాలయ్ సీజన్ 2’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డాక్టర్ ప్రభాత్ సిన్హా, అతని బృందం ఎదుర్కొన్న కొత్త సవాళ్లు ఏంటనే ఆసక్తితో టీవీఎఫ్ (TVF) నిర్మించిన ఈ హిందీ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి తొలి సీజన్ లోని లోపాలను ఈ కొత్త సీజన్ అధిగమించిందా? లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం.

కథ :

భట్కండి గ్రామ వాతావరణానికి, అక్కడి ప్రజల ఆలోచనా విధానానికి అలవాటు పడిన డాక్టర్ ప్రభాత్ సిన్హా (అమోల్ పరాశర్).. ఆసుపత్రి (PHC)లో రోగుల సంఖ్య తగ్గడం, మందుల కొరతతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆసుపత్రికి అవసరమైన వనరులు సమకూరాలంటే ‘ఐడియల్ పీహెచ్‌సీ అవార్డు’ సాధించడమే ఏకైక మార్గమని తెలుసుకుంటాడు. పీహెచ్‌సీని పూర్తిగా మార్చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న ప్రభాత్‌కు అనుకోని ఒక కొత్త సవాలు ఎదురవుతుంది. ఆ సవాలు ఏంటి? ఆ తర్వాత అతనికి ఎదురైన మరిన్ని సవాళ్లను ఎలా అధిగమించాడు? అన్నదే మిగతా సిరీస్ కథ.

ప్లస్ పాయింట్స్ :

గత సీజన్ కి సంబంధించి మేకర్స్ ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారో ఏమో కానీ, సీజన్ 1 కంటే ఈ రెండో సీజన్ కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. ఇందులో కోర్ లైన్ ని ఎంచుకున్న విధానం, కథను నడిపించిన తీరు తొలి సీజన్ కంటే బెటర్ గా అనిపిస్తాయి.. అలానే లీడ్ రోల్ చేసిన అమోల్ పరాశర్ తన నటనతో మెప్పించాడు.

ఇక ఫుటానీ పాత్రలో ఆనందేశ్వర్ ద్వివేది, గోవింద్ పాత్రలో ఆకాష్ మఖిజా మరోసారి ఈ సిరీస్‌కు ప్రధాన బలంగా నిలిచారు. తమదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్విస్తారు. ముఖ్యంగా పర్మినెంట్ ఉద్యోగం, పెళ్లి చుట్టూ తిరిగే గోవింద్ ట్రాక్ ఈ సీజన్‌లో బాగుంది. ఈ క్యారెక్టర్ ఎమోషన్స్‌ను ఆకాష్ మఖిజా అద్భుతంగా పలికించాడు. డాక్టర్ చేతక్ కుమార్‌గా వినయ్ పాఠక్, బాబు సాహెబ్‌గా దినేష్ లాల్ యాదవ్ (నిరహువా) తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.

చివరి ఎపిసోడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొన్ని ఎమోషనల్ సీన్స్ అంతగా పండకపోయినా, మౌసమి భారతి పాత్ర ద్వారా వచ్చే కొన్ని హార్ట్ టచింగ్ సీన్స్ తో సిరీస్‌కు మంచి ముగింపును ఇచ్చాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సీజన్‌లో ప్రధాన లోపం ఏదన్నా ఉంది అంటే నెమ్మదిగా సాగదీసే కథనం అని చెప్పాలి. 30–40 నిమిషాల నిడివి గల ఐదు ఎపిసోడ్లు మాత్రమే ఉన్నప్పటికీ, కథనం చాలా సాగదీసినట్లు అనిపిస్తుంది. కథాంశం బలంగానే ఉన్నా, ఈ స్లో నరేషన్ వల్ల ఆ ఇంపాక్ట్ తగ్గిపోయింది. ‘ఐడియల్ పీహెచ్‌సీ అవార్డు’ కాన్సెప్ట్ ఈ సీజన్‌కు ఒక మంచి పర్పస్ ను ఇచ్చినా, నెమ్మదిగా సాగే కథనం దాన్ని దెబ్బతీసింది.

గార్గి, బాబు సాహెబ్ లాంటి సహాయక పాత్రలకు ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పటికీ, వారి క్యారెక్టర్ ఆర్క్స్‌లో ఆ సన్నివేశాలు బలంగా నాటుకునేంత డెప్త్ లేదు. ఆకాంక్ష రంజన్ కపూర్‌కు స్క్రీన్ స్పేస్ తక్కువగా దొరకడంతో తన నటనను ప్రదర్శించే అవకాశం రాలేదు.

సిరీస్ మొత్తం లైట్ హార్టెడ్ గా ఉంచాలని మేకర్స్ ప్రయత్నించారు, అది చాలా వరకు వర్కౌట్ అయింది. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సన్నివేశాల్లో సహజంగా భావోద్వేగాలు పండకముందే ముందే వచ్చేస్తూ సీన్ ని పండించలేకపోయింది అనిపిస్తోంది. అలాగే డాక్టర్ చేతక్ కుమార్ కూతురి సబ్ ప్లాట్ ను పూర్తిగా వాడుకోలేకపోయారు.

సాంకేతిక విభాగం :

సిరీస్ లో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. గిరీష్ కాంత్ సినిమాటోగ్రఫీ పల్లెటూరి వాతావరణాన్ని చక్కగా బంధించింది. రోహిత్ శర్మ సంగీతం కథనానికి తగ్గట్టుగా ఉంది. అయితే చంద్రశేఖర్ ప్రజాపతి ఎడిటింగ్ ఈ సీజన్ కు వీక్ పాయింట్ అని చెప్పాలి. ఇంకొంచెం ట్రిమ్ చేసి ఉంటే మరింత ఎంగేజింగ్ గా ఉండేది.

ఇక దర్శకుడు దర్శకుడు లలితం ఆనంద్ విషయానికి వస్తే.. సిరీస్‌ను దాదాపు అర్థవంతంగా తెరకెక్కించాడు. వైభవ్ సుమన్, శ్రేయా శ్రీవాస్తవతో కూడిన రచయితల బృందం తొలి సీజన్ లోని లోపాలను సవరించుకుంటూ ఈసారి మంచి ఫోకస్డ్ కథతో ముందుకొచ్చింది. అయినప్పటికీ, స్క్రీన్ ప్లే లో పేసింగ్ సమస్యలు స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని ఎమోషనల్, క్యారెక్టర్ డ్రైవెన్ మూమెంట్స్ ను పూర్తిగా ఎక్స్ ప్లోర్ చేయడంలో తడబడ్డారు. ఇవి కరెక్ట్ చేసుకుంటే బాగుణ్ణు.

తీర్పు :

ఇక మొత్తంగా చూస్తే, మంచి కాన్ఫిక్ట్, నటీనటుల పెర్ఫార్మెన్స్ ల వల్ల ‘గ్రామ్ చికిత్సాలయ్ సీజన్ 2’ తొలి సీజన్ కంటే కాస్త మెరుగ్గా అనిపిస్తుంది. ముగింపు, కొన్ని ఎమోషనల్ సీన్స్ పర్వాలేదనిపించినా.. నెమ్మదిగా సాగే కథనం, అసంపూర్తిగా ఉన్న సపోర్టింగ్ క్యారెక్టర్స్ సిరీస్ స్థాయిని తగ్గించాయి. రైటింగ్, ఎగ్జిక్యూషన్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది. స్లో బర్న్ రూరల్ డ్రామాలను ఓపికగా చూడగలిగితే.. ఈ వీకెండ్ కు ఓసారి మీరు ఈ సిరీస్ ను ట్రై చేయొచ్చు.

123telugu.com Ranking: 2.75/5

Reviewed by means of 123telugu Group

Click on Right here For English Assessment

The put up ఓటీటీ సమీక్ష: ‘గ్రామ్ చికిత్సాలాయ్’ సీజన్ 2 – ప్రైమ్ వీడియోలో first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.