iPhone 15 Now Accessible to Middl

iPhone 15: ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ లో ఎలక్ట్రానిక్ వస్తువుల్లో యాపిల్ కంపెనీకి చెందిన ఎలక్ట్రానిక్ వస్తువులు అగ్రస్థానంలో ఉన్నాయి. ధర విషయంలో కానీ, మన్నిక విషయంలో కానీ ఈ వస్తువులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. యాపిల్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫోన్స్.ఈ ఫోన్ వాడడం ఒక స్టేటస్ గా భావిస్తారు.

iPhone 15 Now Accessible to Middle-Class Consumers

అలాంటి యాపిల్ ఫోన్ కొనాలంటే సాధారణ ప్రజలకు కష్టమే. కానీ ప్రస్తుత కాలంలో కొన్ని ఈ కామర్స్ సంస్థలు బ్యాంకుల ఆఫర్లతో ఆపిల్ ఫోన్ ను మధ్యతరగతి ప్రజలు కూడా కొనే విధంగా అందుబాటులోకి తెస్తున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఐఫోన్ 15. ఈ మొబైల్ పై ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్ భాగంగా భారీగా ఆఫర్ ను ప్రకటించింది.ఈ ఫోన్ పై 12వేల ధర తగ్గింపుతో పాటు, బ్యాంకు డిస్కౌంట్లు, ఎక్సైజ్ ఆఫర్లు లభిస్తున్నాయి.

ఇవన్నీ పోగా ఈ మొబైల్ 45వేల లోపల లభించనుంది. ఇక ఈ మొబైల్ రిలీజ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా రూ:79,999ధర పలికింది. మొబైల్ లాంచ్ అయిన కొన్ని నెలలకే 45 వేల లోపు ధరకు లభించడం ఆనందదాయకం. అంటే మొబైల్ పై దాదాపుగా 35 వేల తగ్గింపు లభిస్తోందన్నమాట.

ఇక ఈ మొబైల్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఐఫోన్ 15 కొత్త డైనమిక్ ఐలాండ్ టెక్నాలజీతో వస్తోంది. 6.1 అంగుళాల డిస్ప్లే,2000nits గణనీయంగా పెంచింది. అలాగే ఐఫోన్ 15 కెమెరా విషయానికి వస్తే 48 ఎంపీ ప్రైమరీ కెమెరా, క్వాడ్ పిక్సెల్ సెన్సార్ మరియు 100% ఫోకస్ పిక్సల్స్ ఉన్నాయి. 24 ఎంపీ సూపర్ హై రిజల్యూషన్ డిఫాల్ట్ సెట్టింగ్ ఉంది.