బాలీవుడ్ సెన్సేషన్ కృతి సనన్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం ‘కాక్‌టెయిల్ 2’ సందడిలో ఉంది. షాహిద్ కపూర్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన ‘ఫెమినా బ్యూటీ అవార్డ్స్’లో పాల్గొన్న కృతి, తన కో-స్టార్ రష్మిక గురించి మనసు విప్పి మాట్లాడార. రష్మికతో మొదటిసారి కలిసి పనిచేయడం గురించి కృతి స్పందిస్తూ..
‘రష్మిక చాలా నిజాయతీ గల వ్యక్తి. ఆమెలో అస్సలు అసూయ ఉండదు. ఆమె చుట్టూ ఎప్పుడూ ఒక పాజిటివ్ ఆరా (Certain Air of secrecy) ఉంటుంది” అని కొనియాడారు. షూటింగ్ సెట్‌లో రష్మికతో గడపడం చాలా సరదాగా ఉంటుందని, ఆమెలోని మంచితనం అందరికీ నచ్చుతుందని కృతి పేర్కొన్నారు. అలాగే 2012లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘కాక్‌టెయిల్’కు ఇది సీక్వెల్ అని అందరూ భావిస్తున్నారు. అయితే కృతి దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇది సీక్వెల్ కాదని, కేవలం ఒక ఫ్రాంచైజీ సినిమా మాత్రమేనని తెలిపారు. నేటి తరం సంబంధాలకు అద్దం పట్టే సరికొత్త కథతో ఈ సినిమా రూపొందుతోందని వివరించారు. ఇక హోమి అడజానియా దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాక్‌టెయిల్ 2’ జూన్ 19న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలోని ‘జబ్ తలక్’ అనే సాంగ్ ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలిచింది. రష్మికకు ఇది ఐదో బాలీవుడ్ చిత్రం కాగా, షాహిద్ కపూర్‌తో కృతికి ఇది రెండో సినిమా.
