నాని ఎప్పుడూ కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు వస్తూ తనదైన ఇమేజ్‌ను సృష్టించుకున్నాడు. ఇప్పుడు ఆయన తన కొత్త సినిమా “ది ప్యారడైజ్”తో మరో లెవెల్ ఎక్స్‌పెరిమెంట్ చేయబోతున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిని దాటి, “పాన్ వరల్డ్” రేంజ్‌లో విడుదల కానుంది. తెలుగు సినిమాల్లో ఇది మరో గర్వకారణం అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, స్పానిష్ భాషలో కూడా రిలీజ్ చేయాలని యూనిట్ ఇప్పటికే నిర్ణయించిందట.
కాగా ఈ సినిమా అంతర్జాతీయ మార్కెట్‌లో సెన్సేషన్ సృష్టించేందుకు పలు హాలీవుడ్ స్టూడియోలతో మేకర్స్ చర్చలు జరుపుతున్నారని సమాచారం. అంతే కాదు, ఈ ప్రాజెక్ట్‌లో హాలీవుడ్ యాక్షన్ స్టార్ ర్యాన్ రేనాల్డ్స్‌ను కీలక పాత్ర కోసం సంప్రదించినట్టు టాక్ ఉంది. ర్యాన్ ఈ సినిమాలో నటిస్తే, “ది ప్యారడైజ్” నిజంగా గ్లోబల్ లెవెల్లో తెలుగు సినిమాను నిలబెడుతుందని అంటున్నారు సినీ వర్గాలు. నాని గతంలో చేసిన “దసరా” వంటి సినిమాలతో తన యాక్టింగ్ రేంజ్ చూపించాడు. కానీ “ది ప్యారడైజ్” మాత్రం ఆయన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా మారే అవకాశం ఉందని చెప్పొచ్చు. పాన్ వరల్డ్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని మేకర్స్ బిగ్ ప్లాన్‌లు వేస్తున్నారు. మొత్తానికి నాని ఇప్పుడు తెలుగు సినిమాను ప్రపంచ వేదిక పైకి తీసుకెళ్లే ప్రయత్నం లో ఉన్నాడని చెప్పవచ్చు.
