ఇండియన్ సినిమా దగ్గర తెరకెక్కుతున్న ప్రస్తుత బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లలో దర్శకుడు అట్లీ అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో చేస్తున్న “రాకా” సినిమా కూడా ఒకటి. మరి ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా వచ్చిన ఫస్ట్ తర్వాత నుంచి ఈ సినిమాకి సంబంధించి పలు శుభవార్తలు వస్తున్నాయి.
అయితే ఈ సినిమాలో ఐకాన్ స్టార్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణ్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈమె నిన్ననే మరోసారి తల్లి కాబోతున్నట్టుగా ఓ శుభవార్తని షేర్ చేసుకోవడం సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఇక లేటెస్ట్ గా దర్శకుడు అట్లీ, ప్రియ దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు శుభవార్త అందించారు.
అట్లీ ఒక బ్యూటిఫుల్ పోస్ట్ ని షేర్ చేసి తన కొడుకుకు ఒక చిట్టి చెల్లెలు వచ్చింది అన్నట్టు ఆనందం వ్యక్తం చేయగా కాజల్, అనన్య పాండే సమంత తదితర నటులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సో ఇలా రాకా టీం నుంచి మాత్రం వరుస గుడ్ న్యూస్ లు వస్తున్నాయని చెప్పాలి.
View this submit on Instagram
The submit RAAKA: వరుస గుడ్ న్యూస్ లతో ‘రాకా’ టీం.. నిన్న దీపికా ఇప్పుడు అట్లీ first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.
